Sada : హీరో నితిన్ నటించిన జయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది హీరోయిన్ సదా. వెళ్లవయ్యా వెళ్ళు అంటూ ఒక్క డైలాగ్ తో కుర్రకారు దృష్టి మొత్తం తనవైపు తిప్పేసుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో తెలుగులో ఈ అమ్మడు వరుస అవకాశాలను దక్కించుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగులో దూసుకుపోయింది. తెలుగుతోపాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. డైరెక్టర్ శంకర్ డైరక్షన్‌లో వచ్చిన అపరిచితుడు సినిమాతో భారీ హిట్ ను అందుకుంది సదా. ఈ సినిమా హిట్‌తో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా నటిగా మంచి గుర్తింపు వచ్చింది.
ఎంత త్వరగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుందో సదా అంత త్వరగానే వెండితెర నుంచి కనుమరుగై పోయింది. అప్పుడప్పుడూ బుల్లితెర ప్రేక్షకులకు కొన్ని షో లకు జడ్జిగా వ్యవహరిస్తూ దగ్గరయ్యింది. ప్రస్తుతం సదా తన యూట్యూబ్ ఛానల్ లో తన విశేషాలు పంచుకుంటూ అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఇటీవల ఓ వెబ్ సిరీస్ ద్వారా మళ్లీ ఫామ్ లోకి వచ్చింది సదా. ఈ క్రమంలోనే అమ్మడి గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. అది సదా పెళ్లికి సంబంధించి విషయం కావడంతో యువత కూడా తెలుసుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు.

తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ సదా టాప్ హీరోయిన్‌గా ఉన్న సమయంలో హీరో మాధవన్ తో చాలా చనువుగా ఉండేది. సదా మాధవన్ తో మూడు సినిమాల్లో నటించింది. వీటిలో ప్రియ సఖి సినిమా తెలుగులో కూడా వచ్చింది. అయితే ఆ సినిమా సమయంలో సదా, మాధవన్ గురించి ఓ వార్త బయటకు బాగా ప్రచారం అయింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని చాలా వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి.
మాధవన్ తో ప్రేమ వ్యవహారం నడుస్తుందని వార్త ప్రచారం కావడంతో ఆ రూమర్స్ ని నమ్మి ఓ బడా ఫ్యామిలీ సదా క్యారెక్టర్ బ్యాడ్ గా ఉంది అని వివాహాన్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగిందని వార్తలు వినిపించాయి. అలాంటి టైంలో ఆ వార్తలు విని సదా ఎంతో బాధపడిందట. ఇలాంటి రూమర్లు విని మొదట్లో చాలా బాధగా అనిపించేది. సెలబ్రిటీ అన్నాక ఇలాంటి రూమర్స్ రావడం కామనే అని ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను అంటూ ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.