Bigg Boss Telugu 6 : బుల్లి తెరపై తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇలాంటి షోలు మొదట విదేశాల్లో ఉండేవి. అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో ఇండియాలో ప్రారంభించారు. మొదట నార్త్ లో ఈ షోని ప్రారంభించారు. అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించడంతో అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ బిగ్ బాస్ ని ప్రారంభించారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ 5 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6పై దృష్టి పెట్టారు నిర్వాహకులు. సెప్టెంబర్ మొదటివారంలో బిగ్ బాస్ సీజన్ 6 షో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
బిగ్ బాస్ సీజన్6 కు వెళ్లే కంటెస్టెంట్ల జాబితా ఫైనల్ గా వచ్చేసింది. గతంలో వినిపించిన పేర్లలో కొంతమంది ఈ జాబితాలో ఉండగా మరి కొందరు ఈ జాబితాలో కొత్తగా చేరడం గమనార్హం. ఇప్పుడు తాజాగా అభినయశ్రీ బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. తొలిసారిగా నాగార్జున నటించిన స్నేహమంటే ఇదేరా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అల్లు అర్జున్ ఆర్య చిత్రంతో ఆ అంటే అమలాపురం స్పెషల్ సాంగ్ లో ఆడి పాడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉర్రూతలూగించింది అభినయశ్రీ. ఈ చిత్రంతో అభినయశ్రీ ఎంతో మంచి పేరు సంపాదించుకుంది.

ఆర్య, శ్వేత నాగు, అత్తిలి సత్తిబాబు, మైఖేల్ మదన కామరాజు వంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. 2014 లో పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో చివరిసారిగా నటించి తెలుగు తెర నుంచి కనుమరుగయ్యింది. ఎన్నో చిత్రాల్లో నటించినా ఆమెకు సరైన గుర్తింపు అందుకోలేకపోయింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా నటించింది అభినయశ్రీ. తమిళ టెలివిజన్ షోలో జూనియర్ సూపర్ డాన్స్, డాన్స్ జోడీ డాన్స్ వంటి పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించింది. కానీ కొంత కాలంగా అభినయశ్రీ అనే నటి ఉందని చాలామంది మరచిపోయారు. మరలా ఆమె పేరు బిగ్ బాస్ షో పుణ్యమా అంటూ వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్స్ లో కొత్తగా చేరిన పేర్లలో అభినయశ్రీ కూడా ఒకరు.
బాస్ బాస్ సీజన్ 6లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరనే విషయానికి వస్తే.. ఇప్పటికే చాలామంది పేర్లు బయటకు వచ్చాయి. చివరి నిమిషం వరకూ సెలెక్ట్ చేసిన 25 మంది లిస్ట్‌లో ఫైనల్ అయ్యే వాళ్ల వివరాలను సీక్రెట్‌గానే ఉంచగా.. లీకైన సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టబోయే 20 మంది కంటెస్టెంట్స్ పేర్లు ఇవి అని తెలుస్తోంది. ఈ సీజన్ 6లో సెలబ్రిటీస్ తోపాటు కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ కూడా పాల్గొంటున్నారు.
ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోయేవారి వివరాలు ఇలా ఉన్నాయి. బాలాదిత్య, హీరో అర్జున్ కళ్యాణ్, శ్రీహాన్, యూట్యూబర్ ఆదిరెడ్డి, రాజశేఖర్ (కామన్ మ్యాన్), జబర్దస్త్ ఫైమా, నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ పింకీ సుదీప, జబర్దస్త్ చలాకీ చంటి, గలాటా గీతు, దీపిక పిల్లి, సింగర్ రేవంత్, తన్మయ్, వాసంతి కృష్ణన్, ఇస్మార్ట్ అంజలి, సీరియల్ నటి శ్రీ సత్య, అభినయ శ్రీ, మెరీనా అబ్రహాం, రోహిత్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక వీరిలో ఎవరు ఈ సారి సీజన్‌లో ఉంటారో చూడాలి.