Anasuya : లైగర్ రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండపై పరోక్షంగా స్పందిస్తూ స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించింది. దీంతో ట్విట్టర్ వేదికగా రచ్చ మొదలైంది. కొంతమంది నెటిజన్లు అనసూయని ఆంటీ అని సంబోధిస్తూ కామెంట్స్ చేశారు. నన్ను ఆంటీ అంటారా.. ఏజ్ షేమింగ్ చేస్తారా.. కేసు పెడతా అంటూ అనసూయ వారిపై విరుచుకుపడింది. దీనితో ఒక్కసారిగా ట్రోలర్స్ ఆంటీ అంటూ అనసూయపై పెద్దఎత్తున ట్రెండింగ్ మొదలు పెట్టారు. అనసూయ ఒంటరి పోరాటం షురూ చేసింది. తనని అసభ్యంగా తిడుతున్న వారందరికీ బదులిస్తూ ట్వీట్స్ వర్షం కురిపించింది.
గత మూడు రోజులుగా వరుసగా ట్వీట్లు చేస్తూ ఆమె తన సహనాన్ని, తన బాధను, తన ఆవేదనను వ్యక్తం చేస్తోంది. అయితే నెటిజన్లు ఆమెను ఆంటీ అంటూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నా ట్వీట్లు చేయడం మాత్రం ఆపడం లేదు. అనసూయను ఓ నెటిజన్ ప్రశ్నిస్తూ.. ఆంటీ అని పిలిస్తే రెస్పెక్ట్ లేనట్టా అని అంటే.. ఇలా వితండ వాదాలు చేస్తే మీకొచ్చే లాభం ఏమిటి ? నా పిల్లల ఫ్రెండ్స్, మా చుట్టాల్లో పిల్లలకు నేను ఆంటీనే. కానీ ఇక్కడ మీరతంతా చూసేది నా వయస్సును. మీ ఉద్దేశాలు వేరు. అది తప్పు. అది అగౌరవ పరచడం అని అంటున్నాను అని అనసూయ ఘాటుగా స్పందించింది.

ఇదే క్రమంలో మరో నెటిజన్ అనసూయని అసభ్యంగా ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు. ఒక రోజుకి నీ రేటు ఎంత.. అదే ఒక షోకి ఎంత తీసుకుంటావు అంటూ వెటకారంగా ప్రశ్నించాడు. దీంతో అతడికి అనసూయ ఎమోషనల్ గా దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. చాలా లోకువ కదండీ మీకు నేనంటే.. అదే మీ చెల్లినో, భార్యనో ఇలా అడుగుతారా.. మీ రేటు ఎంత.. అదే ఆఫీస్ లో వాళ్ళని అడిగితే ఏం చెబుతారు అని ఫైర్ అయింది. దీంతో ఆ నెటిజన్ ఆ ట్వీట్ ని వెంటనే డిలీట్ చేశాడు. ఇలా అనసూయ నెటిజన్లతో గొడవకు దిగడంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. దీనికి ముగింపు లేదా అనసూయ గారు అంటే.. మీ చేతుల్లోనే ఉన్నది. లేదా చివరికు చట్ట ప్రకారం శిక్ష పడుతుంది అని అనసూయ ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది.