ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డును నిర్మించారు. అయితే రోడ్డును ప్రారంభిద్దామని ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టగానే ఆ రోడ్డు పగిలిపోయింది. దీంతో అందరూ ఖంగు తిన్నారు. ఈ సంఘటన అక్కడ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..
బిజ్ నోర్ సదర్ అనే ప్రాంతంలోని హల్దౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఖేడా అజీజ్‌పుర అనే గ్రామంలో రూ.1.16 కోట్ల వ్యయంతో రోడ్డును నిర్మించ తలపెట్టారు. అందులో భాగంగా 7.50 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించాల్సి ఉంది. దాంట్లో 700 మీటర్ల మేర కొంత భాగంలో రోడ్డును నిర్మించారు. ఈ క్రమంలో ఆ రోడ్డును ప్రారంభించేందుకు అక్కడి ఎమ్మెల్యే సుచి చౌదరి హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా ఆమె కొబ్బరికాయ కొట్టి రోడ్డును ప్రారంభించారు. అయితే కొబ్బరికాయ కొట్టగానే కొంత సేపటికి రోడ్డులో పగుళ్లు వచ్చాయి. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి సంబంధిత శాఖలకు చెందిన అధికారులపై ఆమె ఫైరయ్యారు. వెంటనే ఈ విషయాన్ని అక్కడి కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా.. అధికారులు విచారణ చేపట్టారు.
పూర్తి నాణ్యతా లోపంతో రోడ్డును నిర్మించారని, అందుకనే రోడ్డుకు బీటలు వచ్చాయని తేల్చారు. దీంతో రోడ్డును నిర్మించిన కాంట్రాక్టర్‌తోపాటు సంబంధిత శాఖలకు చెందిన అధికారులపై చర్యలు తీసుకోనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…