Rashmika Mandanna : ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే రష్మిక తాజాగా తన ఫిట్ నెస్ సీక్రెట్ గురించి బయట పెట్టింది.

ఈ విధంగా రష్మిక తన ఫిట్ నెస్ గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫిట్ నెస్ కావాలంటే ఎక్కువగా జిమ్ చేయడమే కాదు.. సరైన ఆహారం తీసుకోవాలని రష్మిక సూచించింది. వీటితోపాటు ఎంతో మంచి అలవాట్లను నేర్చుకోవడం వల్ల మన శరీరంలో మార్పులు కూడా వస్తాయని రష్మిక ఈ సందర్భంగా వెల్లడించింది.
ఇలా ఫిట్ నెస్ కోసం ఈ విధమైన జిమ్, అలాగే ఆహార నియమాలు పాటించాలంటే మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. ఇదే కనుక అలవాటైతే ఎన్నో అద్భుతాలు జరుగుతాయని ఈ సందర్భంగా రష్మిక ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా తెలియజేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాలతో ఎంతో బిజీగా ఉంది.