Anasuya : బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఒకవైపు బుల్లితెరపై మరోవైపు వెండితెరపై అద్భుతమైన అవకాశాలను అందుకుని దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. సోషల్ మీడియా వేదికగా అనసూయ చేసే ఏ పోస్ట్ అయినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా అనసూయ ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే ఈ వీడియోలో తన భర్త భరద్వాజ్ కూడా ఉన్నారు. ఈ వీడియో ద్వారా అనసూయ మాట్లాడుతూ అసలు మగాళ్ళతో పనేంటి అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram
సోషల్ మీడియా వేదికగా అమ్మాయిల గురించి ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే గట్టిగా స్పందించే అనసూయ ఇలాంటి బోల్డ్ కామెంట్స్ చేసిందేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే అనసూయ మెగాస్టార్ సినిమాలో నటిస్తుస్తోంది. అలాగే పుష్ప ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె పుష్ప 2లో కూడా సందడి చేయబోతోంది.