RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీమియర్ షో తోనే అద్భుతమైన ఆదరణ దక్కించుకొని బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.

సాధారణంగా థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా కూడా ఓటీటీలో విడుదల కావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే అభిమానులు ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా.. అని ఆరా తీస్తున్నారు. సాధారణంగా థియేటర్లలో విడుదలైన తర్వాత 45 రోజులకు ప్రతి ఒక్క సినిమా కూడా ఓటీటీలో విడుదల అవుతుంది.
అయితే ఈ సినిమా కూడా అన్ని సినిమాల మాదిరిగా నెల రోజుల వ్యవధి తర్వాత విడుదల అవుతుందని భావించిన వారికి చిత్రబృందం షాకింగ్ న్యూస్ తెలియజేసింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 90 రోజులకు ఓటీటీలో విడుదలవుతుందని తెలియజేశారు. దీని ప్రకారం చూస్తే ఈ సినిమా జూలై నెలలో ఓటీటీలో విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌ను జీ5 భారీ డీల్‌కు సొంతం చేసుకోగా.. హిందీ వెర్షన్‌ను మాత్రం నెట్‌ఫ్లిక్స్ కొనుగొలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తోంది.