Rana : దగ్గుబాటి వారసుడు రానా నటుడిగానూ,హోస్ట్‌గానూ అదరగొడుతున్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్‌గా పలు కార్యక్రమాలు చేస్తున్నాడు. లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి వారసుడు రానా ఇటీవల నెగెటివ్ షేడ్ పాత్రలలోనూ కనిపించి మెప్పిస్తున్నాడు. బాహుబలిలో విలన్‌గా నటించిన రానా ఇప్పుడు భీమ్లా నాయక్ చిత్రంలోనూ నెగెటివ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో ఆయన పాత్ర పేరు డానియల్ శేఖర్ కాగా, రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
హీరో రానా సినిమా షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉంటాడు. ఈ క్రమంలో తనపై వచ్చిన రుమర్స్‌పై ఘాటుగా స్పందిస్తుంటాడు. ఇటీవల తను నటించిన ‘విరాట పర్వం’ మూవీ గురించి ఓ వెబ్‌సైట్ రాసిన కథనంపై రానా స్పందించాడు. అంతేగాక ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ సదరు వెబ్‌సైట్‌పై అసహనం వ్యక్తం చేశాడు.
‘విరాట పర్వం’ చిత్రం డైరెక్టర్‌కు, సంగీత దర్శకుడికి మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే ఇంతకాలం పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగారని రాసుకొచ్చారు. అది చూసిన రానా .. ‘ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు.
తాజాగా విరాటపర్వం సినిమాకు సంబంధించి మరో రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పలు భాషల సమస్య వలన విరాటపర్వం చిత్రం ఓటీటీలో విడుదల అవుతుందని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన రానా.. దయచేసి ఈ భాషా సమస్యలపై నాకు అవగాహన కల్పించండి. ఏమి టైమ్ పాస్ గాళ్లు బ్రో మీరు.. అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
https://twitter.com/RanaDaggubati/status/1458344021714104320?s=20