Lasya : బుల్లితెరపై యాంకర్ గా అందరికీ సుపరిచితమైన లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఏదైనా ఒక కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తుంది అంటే ఆ కార్యక్రమం మొత్తం ఎంతో అల్లరిగా, సందడి సందడిగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్ రవితో కలిసి లాస్య చేసిన ఎన్నో కార్యక్రమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ప్రస్తుతం పెళ్లి చేసుకున్న లాస్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ కోసం ఎన్నో కష్టాలు పడుతోంది.
అయితే గతంలో బిగ్ బాస్ షో పాల్గొన్న లాస్య మరింత పాపులారిటీని సంపాదించుకుంది. లాస్య వ్యక్తిగత కారణాల వల్ల కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరం అయింది. ఆ తర్వాత తిరిగి పలు కార్యక్రమాల ద్వారా లాస్య బుల్లి తెరపై సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా లాస్య గురించి గతంలో ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ సెలబ్రిటీ లాస్యను ఇష్టపడ్డాడని ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడట. ఈ క్రమంలోనే అతను అప్పటికే పెళ్ళి జరిగి ఒక ఏడాది బాబు ఉన్నప్పటికీ తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలని ఆమెకు ప్రపోజ్ చేస్తే.. నో.. అని సమాధానం చెప్పిందని తెలుస్తోంది. ఇలా కొన్ని రోజుల తర్వాత లాస్య.. మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఒక బాబుకి జన్మనిచ్చింది. అయితే ఆ వ్యక్తి ఎవరు.. ఏంటి.. అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు.