Mahesh Babu : బీబీపేట మండల కేంద్రంలో దాత సుభాష్‌రెడ్డి శ్రీమంతుడు చిత్ర స్పూర్తితో రూ.6 కోట్లు పెట్టి కట్టించిన హైస్కూల్ బిల్డింగ్‌ను మంత్రులతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ‘‘చాలామంది దగ్గర పైసలుంటయి. కానీ సేవకు ముందుకు రారు. సుభాష్ రెడ్డి తాను చదివిన స్కూలుకు కొత్త బిల్డింగ్ కట్టించడం అభినందనీయం” అన్నారు కేటీఆర్.
తన నాయనమ్మ ఊరు బీబీపేట మండలం కోనాపూర్ గవర్నమెంట్ స్కూల్‌ను శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో డెవలప్ చేస్తామని కేటీఆర్ చెప్పారు. బీబీపేటకు జూనియర్ కాలేజీ మంజూరు చేస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అయితే శ్రీమంతుడు స్పూర్తితో స్కూల్ నిర్మాణం జరిగిందని తెలుసుకున్న మహేష్ స్పందించారు. ఈ స్కూల్ నిర్మించడానికి కారణం శ్రీమంతుడు సినిమా అని తెలిసి ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. సుభాష్ రెడ్డికి చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరు నిజమైన హీరో.. మీ లాంటి వాళ్లే మాకు కావాలి. శ్రీమంతుడు టీంతో కలిసి కచ్చితంగా మీ పాఠశాలకు వస్తాం. ఈ గొప్ప ప్రాజెక్ట్ పూర్తయ్యాక మేం అక్కడికి వస్తామని మహేష్ బాబు తన ట్వీట్‌లో చెప్పుకొచ్చారు.
సుభాష్ రెడ్డి కొడుకు నేహాంత్ శ్రీమంతుడు సినిమా చూసి ఇలా కట్టించాలని అన్నాడట. దాంతో సుభాష్ ఆరు కోట్లు పెట్టి కట్టించాడు. అయితే ఆ పాఠశాలను కేటీఆర్ ప్రారంభించారు.
ఇక్కడకు వచ్చాక తనకు ఆ విషయం తెలిసిందని.. లేదంటే మహేష్ బాబునే ఈవెంట్‌కు తీసుకొచ్చే వాడినని కేటీఆర్ అన్నారు. జూనియర్ కాలేజ్ కడుతున్నారు కదా ? అది పూర్తయిన తరువాత అప్పుడు మహేష్ బాబు తీసుకొద్దాం. ఆయన వస్తే ఇంకా పది మందికీ ఈ విషయం తెలుస్తుంది.. అని కేటీఆర్ ఈ సమావేశంలో మాట్లాడారు.
Will make sure to visit the college with my entire team of Srimanthudu once this noble project is complete. Respect always! 🙏🙏🙏@KTRTRS
— Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2021