Ram Charan Teja : దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వరుస సినిమాలు, కరోనా కారణాల వల్ల పూర్తిగా ఇంటికే పరిమితమైన రామ్ చరణ్ ప్రస్తుతం తన సినిమాల నుంచి కాస్త విరామం దొరకడంతో తన భార్యతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లారు. వినయ విధేయ రామ సినిమా తర్వాత ఈ జంట ప్రస్తుతం హాలిడే వెకేషన్ కు వెళ్ళింది.

ఇలా ఈ జంట ఇద్దరూ హాలిడే వెకేషన్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఉపాసన వెకేషన్ లో చేసిన కొన్ని అల్లరి పనులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. కాగా ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#RamCharan and #Upasana's adorable video from their recent fun filled vacation to Finland@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/BEU7Nu7iDY
— BA Raju's Team (@baraju_SuperHit) March 14, 2022
ఇక తాజాగా ఈ జంట సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఫన్నీ వీడియో వైరల్ గా మారింది. ఎయిర్ పోర్ట్ లో ఉపాసన, రామ్ చరణ్ ట్రాలీ పై కూర్చుని ఒకరినొకరు తోయడం, మంచు కొండలలో మంచు తినడం, ఒక కుక్క పక్కన మంచులో రామ్ చరణ్ పడుకోవడం ఇలాంటివి.. ఇంకా ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ జంట చిన్నపిల్లలుగా మారి ఈ వెకేషన్ ను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.