Ram Charan Tej : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం పలు వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. అయితే ఆయన గత కొద్ది రోజుల నుంచి ముంబైలో ఉంటున్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు ఆయన ముంబైలో ఎందుకు ఉన్నారు ? అన్న విషయాలు తెలియడం లేదు. కానీ ఆయన తమకున్న వ్యాపారాల పనుల నిమిత్తమే ముంబైలో ఉంటున్నారని తెలుస్తోంది. పలు బిజినెస్ డీల్స్‌ను ఓకే చేసేందుకు రామ్ చరణ్ ముంబైలో ఉంటున్నారని సమాచారం.
ఇక శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ 15వ మూవీ తెరకెక్కుతున్న విషయం విదితమే. గతేడాది కొన్ని లొకేషన్లలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీకి సంబంధించి మెయిన్ పార్ట్ షూటింగ్‌ను రాజమండ్రిలో చేయాల్సి ఉంది. అది బుధవారం నుంచి ప్రారంభం కావాలి. కానీ రామ్ చరణ్ మాత్రం ఇంకా ముంబైలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్‌కు వచ్చాక.. షూటింగ్‌ను రీషెడ్యూల్ చేయనున్నారు.

ఈ మూవీలో ప్రధాన పార్ట్‌ను రాజమండ్రి పరిసరాల్లో చిత్రీకరించనున్నారు. ఆ షూటింగ్ 15 రోజుల పాటు జరగనుంది. అందులో హీరోయిన్ కియారా అద్వానీ కూడా పాల్గొననుంది. ఇక త్వరలోనే కొత్త షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. ఈ మూవీకి ఇంకా టైటిల్‌ను నిర్దారించలేదు. ఇక దీనికి థమన్ సంగీతం అందిస్తుండగా.. రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు.