Dimple Hayathi : రవితేజ హీరోగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. ఖిలాడి. ఈ మూవీ ఈ నెల 11వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ప్రస్తుతం చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను చురుగ్గా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాల్లో హీరోయిన్ డింపుల్ హయతి ఒక రేంజ్‌లో అందాలను ఆరబోస్తోంది.
ఖిలాడి మూవీలో హీరోయిన్లు ఇద్దరూ అందాలను ఆరబోశారనే విషయం చిత్ర ట్రైలర్‌ను చూస్తే స్పష్టమవుతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను తాజాగా నిర్వహిస్తున్నారు. వాటిల్లో పాల్గొన్న డింపుల్ హయతి ఒక రేంజ్‌లో గ్లామర్ షో చేసింది. తన భారీ ఎద అందాలను బయట పెట్టింది. ఈమె చేస్తున్న గ్లామర్ షోకు మతులు పోతున్నాయి. ఈమె ఈ రేంజ్‌లో అందాలను ప్రదర్శిస్తుందంటే.. కచ్చితంగా దర్శక నిర్మాతల కళ్లలో పడేందుకే అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఐటమ్ సాంగ్‌లు మాత్రమే చేసే డింపుల్ హయతికి తొలిసారి హీరోయిన్‌గా చాన్స్ వచ్చింది. దీంతో ఆమె ఇకపై హీరోయిన్‌గా మాత్రమే చేయాలని చూస్తోంది. అందుకనే అవకాశాలు రావడం కోసం ఇంతలా రెచ్చిపోతుందని తెలుస్తోంది.
ఇక ఖిలాడి మూవీలో ఆమె ఓ పాటకు గాను ఏకంగా 6 కేజీల బరువు తగ్గింది. దర్శకుడు రమేష్ వర్మ సూచన మేరకు ఆమె 2 నెలల గ్యాప్ తీసుకుని ఏకంగా 6 కిలోల బరువు తగ్గింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా మీడియాకు తెలియజేసింది.