SBI Recruitment 2022 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ తమ బ్యాంకు బ్రాంచిల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్ట్‌లను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో భాగంగానే మొత్తం 48 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వాటిల్లో 15 పోస్టులు నెట్ వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అసిస్టెంట్ మేనేజర్ కాగా, మరో 33 పోస్టులు రూటింగ్ అండ్ స్విచింగ్ అసిస్టెంట్ మేనేజర్‌వి.
ఈ క్రమంలోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఈ నెల 25వ తేదీ వరకు స్వీకరించనున్నారు. అందుకు గాను sbi.co.in/web/careers అనే లింక్‌ను సందర్శించి అప్లికేషన్‌ను నింపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ఎగ్జామ్‌ను మార్చి 20, 2022వ తేదీన నిర్వహిస్తారు. మార్చి 5 నుంచి కాల్ లెటర్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆగస్టు 31, 2021వ తేదీ వరకు గరిష్టంగా 40 ఏళ్ల వరకు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. అభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీలో (ఫుల్ టైమ్) ఏదైనా స్ట్రీమ్ అయినా సరే మొదటి డివిజన్‌లో పాస్ అయి ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులను సాధించి ఉండాలి.
ఉద్యోగానికి దరఖాస్తు చేసే General/OBC/EWS కేటగిరి అభ్యర్థులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అలాగే SC/ST/PWD విభాగాలకు చెందిన వారికి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపును ఇచ్చారు. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. పరీక్ష పాస్ అయి వారికి ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.