Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత తరచూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈమె ఏం పోస్టు చేసినా అది వైరల్ అవుతోంది. విడాకుల నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత సమంత తన గ్లామర్ డోసును పెంచడంతోపాటు సోషల్ మీడియాలోనూ మరింత యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు వెకేషన్స్, పార్టీలకు వెళ్తూ సందడి చేస్తోంది. ఇప్పటికే పలువురు అగ్ర హీరోలతో నటించిన సమంత అనేక హిట్స్ సాధించింది. దీంతో ఈమెకు కెరీర్‌లో తిరుగు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఈమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత ఈమె చాలా డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు అర్థమవుతుంది. అందుకనే అనేక సార్లు సందేశాలను పోస్ట్ చేసింది. ఆ సమయంలో ఆమెకు ఆమె స్నేహితులు అండగా ఉన్నారు. అనేక టూర్లకు కూడా ఆమె వెళ్లొచ్చింది.
ఇక సమంత ప్రస్తుతం వెకేషన్స్‌కు వెళ్తూనే మరో వైపు సినిమాలు కూడా చేస్తోంది. ఇటీవల ఆమె పుష్ప సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్‌తో ఆమె పేరు జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది. ప్రస్తుతం ఆమె గుణశేఖర్‌తో కలిసి శాకుంతలం అనే మూవీ షూటింగ్‌ను పూర్తి చేసింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే యశోద అనే మరో పాన్ ఇండియా స్థాయి సినిమాలో ఈమె నటిస్తోంది. ఇక సమంత విడాకుల విషయం అయితే మాటిమాటికీ తెరపైకి వస్తూనే ఉంది. ఆమెను కొందరు ప్రశంసిస్తుండగా.. కొందరు మాత్రం విమర్శిస్తూనే ఉన్నారు.

ఇక సమంతకు చెందిన పాత పోస్టులను బయటకు తీసి వాటిని కొందరు వైరల్ చేస్తున్నారు. సమంత గతంలో చైతన్యను మెచ్చుకున్న విషయాలకు చెందిన పోస్టులను కొందరు ఈ మధ్య వైరల్ చేశారు. ఇక తాజాగా ఇంకో పోస్టు కూడా వైరల్ అవుతోంది. సమంత, చైతన్య కలిసి ఉన్న సమయంలో ఆమె చైతన్య గురించి మాట్లాడిన మాటలను ఇప్పుడు కొందరు వైరల్ చేస్తున్నారు. చైతన్య మంచి వ్యక్తి అని, గొప్ప భర్త అని గతంలో ఒకసారి సమంత అన్నమాటలను కొందరు ప్రచారం చేస్తున్నారు.
ఇక గతంలో నాగచైతన్యతో కలిసి ఉన్న సమయంలో ఒకసారి ఆస్క్ మీ ఎనీథింగ్ పేరిట ఓ లైవ్ చాట్ సెషన్ నిర్వహించారు. అందులో భాగంగా సమంతను కొందరు ప్రెగ్నెన్సీ గురించి ప్రశ్నలు అడిగారు. వాటికి ఆమె సమాధానం చెబుతూ.. తన శరీరంలో వచ్చే మార్పుల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, అయితే వారందరికీ త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెబుతానని.. 2022 ఆగస్టు 7వ తేదీన ఉదయం 7 గంటలకు ఓ బిడ్డకు జన్మినివ్వబోతున్నాను.. అంటూ అప్పట్లో ఆమె సమాధానం చెప్పింది. అయితే ఆ పోస్ట్‌ను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.