Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చివరిగా వినయ విధేయ రామ చిత్రంతో ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ అనే చిత్రం చేశాడు. దాదాపుగా మూడు సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషించనుండగా, కోరమీసాలతో కనిపించనున్నారు.
ఆచార్య చిత్రంలోనూ రామ్ చరణ్ కోర మీసాలతో కనిపించనునున్నట్టు సమాచారం. అయితే ఆచార్య, ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో రామ్ చరణ్ మళ్లీ పాత లుక్‌లోకి వచ్చేశాడు. రీసెంట్‌గా ‘నాట్యం’ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన చెర్రీ కొత్త గెటప్.. అభిమానుల్ని ఆకట్టుకుంది. అయ్యప్ప మాలలో గడ్డం లేకుండా.. చాలా తక్కువ మీసాలతో కనిపించాడు.
రామ్ చరణ్ లుక్, ఫిజిక్ కూడా మారడంతో ఇదంతా కూడా శంకర్ సినిమా కోసం అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు ముగించుకున్న వీరి కాంబో మూవీ వచ్చే ఏడాది నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొదటి షెడ్యూల్ కోసం పుణె వెళ్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరో వైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనూ రామ్ చరణ్ ఓ సినిమా చేయనుండగా.. ఈ చిత్రాన్ని 2022 ద్వితీయార్థం ఆరంభంలో ప్రారంభించనున్నట్టు టాక్ వినిపిస్తోంది.