Samantha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంతకు విపరీతమైన క్రేజ్ ఉంది. దసరా పండుగ సందర్భంగా ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారం అయిన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ కి సమంత గెస్ట్ గా వచ్చింది. వీరిద్దరి సరదా కబుర్లతో షో అంతా సందడిగా సాగింది. ఈ క్రమంలో ఆమె తన బిజినెస్ ల గురించి చెప్పింది. సమంత క్లాత్స్ ఔట్ లెట్.. సాకి.. అనే బిజినెస్ ను రన్ చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ మిగతా వ్యాపారాల గురించి ఎవరికీ తెలీదు.
వాటిల్లో సమంత ప్రీ స్కూల్ తో పాటు ఆర్గానిక్ ఫామింగ్ ను నడిపిస్తోంది. ఇంకా ఎన్నో రంగాల్లో తన మార్క్ తో బిజినెస్ లు చేస్తోంది. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలనే ఉద్దేశ్యంతోనే ఆమెకు సంబంధించిన బిజినెస్ లను చెప్పాలని, వాటిని ఎంతోమంది మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని ఎన్టీఆర్ అన్నారు. అందుకే సామ్ తన బిజినెస్ లను చెప్పింది. దీంతో సామ్ కు ఇన్ని బిజినెస్ లు ఉన్నాయా.. అంటూ షాక్ అవుతున్నారు. అయితే సామ్ హీరోయిన్ గా సంపాదిస్తూనే తన చారిటీతో ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేస్తోంది.
ఇక తన వ్యాపారాల లిస్ట్ ను విన్న అభిమానులు ఆనందిస్తున్నారు. కాగా సమంత బాలీవుడ్ ఎంట్రీకి కన్ఫార్మ్ అయ్యింది. సౌత్ ఇండియాలో ఇప్పటికే ఈమె ఓ రేంజ్ క్రేజ్ ని దక్కించుకుంది. ఇక బీటౌన్ లో కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే పనిలో పడింది. ఆమె తెలుగులో ఇప్పటికే నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. దీంతోపాటు విఘ్నేష్ శివన్ తో కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో సామ్ కు బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో ఆమె కెరీర్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని చూస్తోంది.