ఏపీ అసెంబ్లీలో తనపై, తన భార్య భువనేశ్వరిపై అసభ్య పదజాలం ఉపయోగించారని, దారుణమైన వ్యాఖ్యలు చేశారని.. చెబుతూ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్‌లో గుక్క పెట్టి ఏడ్చారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబును ఓదారుస్తూ రజనీకాంత్ ఫోన్ కాల్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా వట్టి ప్రచారమేనని, చంద్రబాబుకు సింపతీ వచ్చేందుకు టీడీపీలోని ఓ వర్గమే ఇలా ప్రచారం చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఇటీవల పట్టాభి వ్యాఖ్యల అనంతరం ఏపీలో జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేసేందుకు బాబు ఢిల్లీ వెళ్లగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో అపాయింట్‌మెంట్ లభించలేదు. దీంతో బాబు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి వెనక్కి వచ్చేశారు. తరువాత అమిత్ షా ఫోన్ చేశారని కలరింగ్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
ఇక ఇప్పుడు కూడా సింపతీ కొట్టేసేందుకే రజనీకాంత్ పేరును టీడీపీ వాడుకుంటుందని.. మీడియాలో కొన్ని వర్గాలు అంటున్నాయి. రజనీకాంత్ నిజంగానే ఫోన్ కాల్ చేసి ఉంటే ఆ విషయాన్ని ఆయన తన సోషల్ ఖాతాల ద్వారా వెల్లడించేవారని.. అధికారికంగా కన్‌ఫాం చేసేవారని.. కానీ ఆయన అలా చేయలేదు.. కనుక ఆయన చంద్రబాబుకు ఫోన్ కాల్ చేశారన్న మాట కూడా అవాస్తవమేనని అంటున్నారు.
ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ఘోర ఓటమి పాలైనందుకు.. తాజాగా ఏపీలో జరిగిన పరిణామాలపై పార్టీ పట్ల ప్రజల్లో సింపతీ కొట్టేసేందుకే టీడీపీలోని కొందరు ఇలా ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారని.. చర్చ నడుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత ఉంది ? అన్నది తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…