కేంద్ర ప్రభుత్వం తాన అమలులోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ప్రధాని మోదీ తాజాగా ఈ ప్రకటన చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రక్రియ ద్వారా ఆ చట్టాలను రద్దు చేస్తామన్నారు. అయితే చట్టాలను రద్దు చేశాకే తమ ఆందోళనలను నిలిపివేస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.
ఇక రైతులు చేస్తున్న ఆందోళనలకు ప్రకాష్ రాజ్ మొదటి నుంచీ మద్దతుగా నిలుస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌ను కోట్ చేస్తూ.. ప్రధాని మోదీపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారు. కేవలం రైతులకు క్షమాపణలు చెబితే సరిపోదని, మరణించిన రైతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఆందోళనల్లో చనిపోయిన 750 మందికి పైగా రైతులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ఇటీవలే ప్రకటన చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కేంద్రం ఒక్కో రైతు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ట్వీట్ ను కోట్ చేస్తూ ప్రకాష్ రాజ్ తాజాగా మోదీపై వ్యాఖ్యలు చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…