Anchor Devi : యాంక‌ర్ దేవితో గొడ‌వ ప‌డితే సినిమా హిట్టేన‌ట‌.. కావాలంటే ప్రూఫ్ ఇదిగో..!

Anchor Devi : యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ వివాదం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తన సినిమా ప్రమోషన్‌ కోసం ఆయన ప్లే చేసే గేమే ఇప్పుడు ఆయన్ని వివాదంలో ఇరుక్కునేలా చేసింది. ఓ వైపు కేసులు, మరోవైపు టీవీ9 యాంకర్‌తో వివాదం ఆయ‌న‌ని ఇరుకున పెట్టింది. అయితే ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్నా కూడా విశ్వ‌క్ సేన్ త‌న మూవీ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంటున్నాడు. విశ్వక్‌ సేన్‌ అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రంలో నటించారు. రుక్సార్‌ థిల్లాన్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌ కోసం ఓ ప్రాంక్‌ వీడియో చేశాడు విశ్వక్‌ సేన్‌. ఇది వివాదంగా మారి హెచ్ఆర్సీ వరకు వెళ్లింది.

Anchor Devi

తన ప్రాంక్‌ వీడియోని చిన్నగా ఫన్‌ కోసం చేశామని, దీంతోపాటు ముందుగానే ఇంకా చాలా ప్రిపేర్‌ అయ్యామని, మైండ్‌లో చాలా ప్లాన్స్ ఉండేవ‌ని తెలిపారు. కానీ ఈ ఒక్క ప్రాంక్‌ వీడియో మొత్తం తలకిందులు చేసిందని, అనుకున్నది ఒక్కటి, అయ్యిందొక్కటి అని వాపోయారు. నా సినిమా గురించి జనం మాట్లాడుకుంటే బాగుండేదని, కానీ ఇప్పుడు అసలు విషయం పక్కకెళ్లి, వివాదం చర్చనీయాంశంగా మారిందన్నారు. ఇలాంటివి మళ్లీ చేయనని తెలిపారు. ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. తన సినిమాని ప్రమోట్‌ చేసుకోవడంలో తప్పేముందని ఆయన అన్నారు.

అయితే గ‌తంలో కూడా దేవి నాగ‌వ‌ల్లి కొంద‌రు హీరోల‌తో చేసిన ఇంట‌ర్వ్యూలు వైర‌ల్ అయ్యాయి. అర్జున్ రెడ్డిలో స్త్రీల‌ను కించ‌ప‌రిచారంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ప‌లు ప్ర‌శ్న‌లు వేసి ఇర‌కాటంలో పెట్టాల‌ని అనుకుంది దేవి. అయితే రౌడీ హీరో త‌న దైన స్టైల్ లో స‌మాధానం ఇచ్చారు. ఆ త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ గీత‌గోవిందం సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్నాడు. రీసెంట్ సిద్దు హీరోగా వ‌చ్చిన డీజే టిల్లు సినిమా ప్ర‌మోష‌న్స్ లో సిద్దూను మీరు ఉమెనైజ‌రా అంటూ ప్ర‌శ్నించింది. దాంతో సీరియ‌స్ అయిన సిద్ధు.. అస‌లు ఉమెనైజ‌ర్ అంటే అర్థం ఏంట‌ని ప్ర‌శ్నించాడు. దీనిపై పెద్ద చ‌ర్చే న‌డిచింది. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్టర్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా విశ్వ‌క్ సేన్ కు దేవి నాగ‌వ‌ల్లితో గొడ‌వ జ‌రిగింది. దీంతో ఈసారి విశ్వ‌క్ సేన్ సినిమా అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం హిట్ అవుతుంద‌ని అంటున్నారు. గ‌తంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సిద్ధుల సినిమాలు దేవితో గొడ‌వ ప‌డ‌డం వ‌ల్లే హిట్ అయ్యాయ‌ని.. క‌నుక విశ్వ‌క్ విష‌యంలోనూ అదే జ‌రుగుతుంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా న‌టుడు సినిమా తీస్తే దేవితో గొడ‌వ పెట్టుకోవాల‌ని.. అప్పుడు ల‌క్ క‌ల‌సి వ‌చ్చి సినిమా హిట్ అవుతుంద‌ని.. ఈ విష‌యంపై జోకులు పేలుస్తున్నారు. మ‌రి విశ్వ‌క్‌కు ఇప్పుడు అదే అంశం క‌ల‌సి వ‌స్తుందా.. లేదా.. అనేది చూడాలి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM