Vishwak Sen : మాస్ కా దాస్.. విశ్వక్ సేన్ పేరు గత మూడు నాలుగు రోజులుగా వార్తలలో తెగ నానుతూ వస్తోంది. మే 6న ఈ యంగ్ హీరో అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌తో కొద్ది రోజులుగా బిజీగా ఉన్న విశ్వక్ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో భాగంగా ప్రాంక్ వీడియో చేశాడు. దీనిపై టీవీ 9 వేదికగా చర్చజరిపాడు. ఆ సమయంలో యాంకర్ దేవితో జరిగిన మాటల యుద్దం గురించి అందరికీ తెలిసిందే. లైవ్ డిబేట్ లో హీరోని ఉద్దేశిస్తూ యాంకర్ కించపరిచే వ్యాఖ్యలు చేయడం.. గెటవుట్ అంటూ అవమానించడం.. అదే సమయంలో విశ్వక్ ఓ బూతు పదాన్ని వాడడం చర్చనీయాంశంగా మారింది.
మీడియాలో అలాంటి అభ్యంతరకరమైన పదాన్ని ఉపయోగించినందుకు విశ్వక్ సేన్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ మాస్ కా దాస్ ను టార్గెట్ చేస్తూ సదరు టీవీ ఛానల్ వరుస కథనాలతో విరుచుకుపడుతోంది. ఎఫ్** సేన్.. అంటూ స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడమే కాదు.. విశ్వక్ సేన్ మాదిరిగానే అస్వక్ సేన్ అంటూ నడిరోడ్డుపై ప్రాంక్ వీడియో చేసి ప్రసారం చేశారు. దీనిని బాబు గోగినేని వంటి వారు ప్రశ్నించడంతో ఈ స్పూఫ్ ప్రాంక్ వీడియోని న్యూస్ ఛానల్ వారు డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఈ విషయంపై వరుస ట్వీట్స్ తో ఆ టీవీ చానల్ ను ఏకిపారేశాడు.
జర్నలిస్టుల ముసుగులో వీళ్లు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. టీవీ9 ఛానెల్ కేవలం డబ్బుల కోసమే న్యూస్ కవర్ చేస్తోంది. నీచమైన రూపంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏమైనా చేస్తోంది.. అని ట్వీట్ చేశాడు. ఈ మొత్తం వ్యవహారంపై సదరు టీవీ ఛానల్ లైవ్ డిబెట్ లో పాల్గొనాలని అనుకున్నానని పేర్కొన్నారు. ఇక సీనియర్ హీరోయిన్ కస్తూరి, యువ దర్శకుడు బండి సరోజ్ కుమార్, నటి కరాటే కల్యాణీ వంటి వారు కూడా విశ్వక్ కు మద్దతుగా నిలిచారు.
అశోకవనంలో అర్జున కళ్యాణం.. సినిమానున మనసు పెట్టి చేశారు. సినిమా చూస్తున్నంత సేపు నా ముఖంపై చిరునవ్వు ఉండింది. నిజాయతీ గల రైటింగ్, పెర్ఫామెన్స్‌లలో స్వచ్చత ఉంది. చాలా క్యూట్‌గా సినిమా ఉంది. ఎంటైర్ టీమ్‌కు అభినందనలు.. అని తెలిపారు సిద్ధు జొన్నలగడ్డ అలియాస్ డీజే టిల్లు. ఈ చిత్రానికి సంబంధించిన రష్, ఎంటర్ టైన్ మెంట్ సన్నివేశాలు, ఎమోషన్స్ నాకు సంబంధించినవిగా ఉన్నాయి. అదే విధంగా పాత్ర కోసం విశ్వక్ సేన్ ఇంతగా ట్రాన్స్ ఫామ్ అవ్వడం అభినందనీయం. సినిమాలో అర్జున్ అనే పాత్రనే కనిపించనుంది. చిత్ర యూనిట్ బాపినీడు, బీవీఎన్ ప్రసాద్, నటీనటులకు శుభాకాంక్షలు.. అంటూ ట్వీట్ చేశాడు సాయి ధరమ్ తేజ. దీంతో విశ్వక్ సేన్‌కు రోజు రోజుకీ సినీ రంగానికి చెందిన వారి మద్దతు లభిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే చివరికి ఈ వివాదం ఎలా.. ఎప్పుడు.. ముగుస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…