Mandira Bedi : భ‌ర్త చ‌నిపోయి కొద్ది రోజులే అవుతోంది.. ఇంకో వ్య‌క్తితో ఇలాంటి చేష్ట‌లేంటి ? మందిరా బేడీపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు..

Mandira Bedi : నటి, ప్రెజంటర్, ఫ్యాషన్ డిజైనర్ అయిన మందిరా బేడీ భర్త, బాలీవుడ్ నిర్మాత రాజ్ కౌశల్ కొద్ది రోజుల క్రితం గుండె పోటుతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. రాజ్ కౌశల్, మందిరా బేడీల వివాహం 2009 లో జరిగింది. వీరికి వీర్ అనే బాబు ఉన్నాడు. తర్వాత ఓ పాపను దత్తత తీసుకుని తారా బేడీ కౌశల్ అనే పేరు పెట్టారు. భర్త మరణంతో మందిరా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే తాజాగా ఆమె మ‌రో వ్య‌క్తికి స‌న్నిహితంగా ఉంటూ వార్త‌ల‌లో నిలిచింది.

Mandira Bedi

మందిరా బేడీ వెకేషన్ కోసం థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో ఉంది. అక్కడ నుంచి మందిరా సోషల్ మీడియాలో చాలా గ్లామ‌ర్‌గా ఉన్న‌ బికినీ చిత్రాలు పంచుకుంది. ఈ ఫోటోలు బయటకు వచ్చిన వెంటనే వైరల్‌గా మారాయి. అయితే ఈ ఫోటోలకు సంబంధించి కొంతమంది ఆమెపై విమర్శలు కూడా చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ లోపల బికినీలో స్నేహితునితో క‌ల‌సి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ చిత్రాలను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆది.. అని పేర్కొంది.

ఈ ఫోటో అన్నింటినీ చెబుతుంది. మనం ఒకరికొకరు ఎంతకాలం తెలుసు ? నేను నిన్ను ఎంతగా విశ్వసిస్తున్నాను, ఆనందం, ప్రేమ, విజయం మీకు దక్కాలి.. అంటూనే 17 సంవత్సరాల వయస్సు నుండి నా ప్రియమైన స్నేహితుడా.. నిన్ను ప్రేమిస్తున్నానని ఆమె పేర్కొంది. అయితే భ‌ర్త చ‌నిపోయి సంవత్స‌రం కూడా కాలేదు. ఈ క్ర‌మంలోనే ఆమె ఇలా చేయ‌డం ప‌ట్ల ప‌లువురు మండిప‌డుతున్నారు. అయితే మందిరా మాత్రం బికినీలో చాలా గ్లామ‌ర్‌గా క‌నిపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తోంది.

90వ దశకంలో శాంతి అనే టీవీ సీరియల్ తో కెరీర్ ప్రారంభించి హోమ్లీ పాత్రలతో మందిరా బేడీ సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంది. తర్వాత దిల్వాలే దుల్హానియా లే జాయేంగే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన ఆమె 2000వ సంవత్సరం తర్వాత వరుస సినిమాలతో బిజీ అయింది. అనంత‌రం సోనీ మ్యాక్స్‌లో ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్ ద్వారా ఆమె క్రికెట్ మ్యాచ్‌ల‌కు యాంక‌ర్‌గా మారి పేరు తెచ్చుకుంది. అప్పుడ‌ప్పుడు ఆమె ఇలాంటి ఫొటోలతో గ్లామ‌ర్ ట్రీట్ ఇస్తుంటుంది. దీంతో ఆమె ఫొటోలు వైర‌ల్ అవుతుంటాయి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM