Mandira Bedi : నటి, ప్రెజంటర్, ఫ్యాషన్ డిజైనర్ అయిన మందిరా బేడీ భర్త, బాలీవుడ్ నిర్మాత రాజ్ కౌశల్ కొద్ది రోజుల క్రితం గుండె పోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. రాజ్ కౌశల్, మందిరా బేడీల వివాహం 2009 లో జరిగింది. వీరికి వీర్ అనే బాబు ఉన్నాడు. తర్వాత ఓ పాపను దత్తత తీసుకుని తారా బేడీ కౌశల్ అనే పేరు పెట్టారు. భర్త మరణంతో మందిరా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే తాజాగా ఆమె మరో వ్యక్తికి సన్నిహితంగా ఉంటూ వార్తలలో నిలిచింది.

మందిరా బేడీ వెకేషన్ కోసం థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో ఉంది. అక్కడ నుంచి మందిరా సోషల్ మీడియాలో చాలా గ్లామర్‌గా ఉన్న బికినీ చిత్రాలు పంచుకుంది. ఈ ఫోటోలు బయటకు వచ్చిన వెంటనే వైరల్‌గా మారాయి. అయితే ఈ ఫోటోలకు సంబంధించి కొంతమంది ఆమెపై విమర్శలు కూడా చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ లోపల బికినీలో స్నేహితునితో కలసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ చిత్రాలను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆది.. అని పేర్కొంది.
ఈ ఫోటో అన్నింటినీ చెబుతుంది. మనం ఒకరికొకరు ఎంతకాలం తెలుసు ? నేను నిన్ను ఎంతగా విశ్వసిస్తున్నాను, ఆనందం, ప్రేమ, విజయం మీకు దక్కాలి.. అంటూనే 17 సంవత్సరాల వయస్సు నుండి నా ప్రియమైన స్నేహితుడా.. నిన్ను ప్రేమిస్తున్నానని ఆమె పేర్కొంది. అయితే భర్త చనిపోయి సంవత్సరం కూడా కాలేదు. ఈ క్రమంలోనే ఆమె ఇలా చేయడం పట్ల పలువురు మండిపడుతున్నారు. అయితే మందిరా మాత్రం బికినీలో చాలా గ్లామర్‌గా కనిపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.
90వ దశకంలో శాంతి అనే టీవీ సీరియల్ తో కెరీర్ ప్రారంభించి హోమ్లీ పాత్రలతో మందిరా బేడీ సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంది. తర్వాత దిల్వాలే దుల్హానియా లే జాయేంగే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన ఆమె 2000వ సంవత్సరం తర్వాత వరుస సినిమాలతో బిజీ అయింది. అనంతరం సోనీ మ్యాక్స్‌లో ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్ ద్వారా ఆమె క్రికెట్ మ్యాచ్‌లకు యాంకర్‌గా మారి పేరు తెచ్చుకుంది. అప్పుడప్పుడు ఆమె ఇలాంటి ఫొటోలతో గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది. దీంతో ఆమె ఫొటోలు వైరల్ అవుతుంటాయి.