Samantha : గత ఏడాది అక్టోబర్ 2 న సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరి విడాకుల వ్యవహారం ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. భార్యా భర్తలుగా విడిపోతోన్నామని, తమ మధ్య ఉన్న ఆ స్నేహబంధం మాత్రం ఎప్పటికీ అలానే ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే చైసామ్ విడాకుల మ్యాటర్‌పై ఎన్నో రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. అందులోంచి ఓ దారుణమైన రూమర్ సమంత డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ గురించి వచ్చింది. 33 ఏళ్ళ ప్రీతమ్ జుకల్కర్ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ప్రస్తుతం ముంబైలో ఫ్యాషన్ డిజైనర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.

తన తల్లి కుట్టు మిషన్ కుట్టడం చూసిన ప్రీతమ్ చిన్ననాటి నుంచే డిజైనర్ అవ్వాలనే ఆశతో ఫ్యాషన్ కి సంబంధించిన చిన్న చిన్న ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడంతోపాటు ఫ్యాషన్ అండ్ టెక్స్‌టైల్స్ డిగ్రీ కూడా చేశాడు. ప్రస్తుతం కొంతమంది హీరోయిన్స్ తోపాటు మోడల్స్ కి డిజైనర్ గా ఉన్న ప్రీతమ్.. సమంతతో కాస్త క్లోజ్‌గా ఉంటాడు. అప్పట్లో ప్రీతమ్ ఒళ్లో సమంత కాలుపెట్టి పడుకోగా, అందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ కాగా, దానిపై ట్రోల్ నడిచింది. విడాకులకి కూడా అతనే కారణమని అన్నారు. అయితే తాజాగా మరోసారి ప్రీతమ్ విషయం చర్చకు వచ్చింది.
సమంత నటించిన కాతువాకుల రెండు కాదల్ విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి లవర్స్ గా నయనతార, సమంత నటించారు. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో సమంత ఓ థాంక్యూ నోట్ ను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తనకు కామెడీ జోనర్ అంటే చాలా ఇష్టమని, కాతువాకుల రెండు కాదల్ మూవీతో ఆ కోరిక తీరినట్లు వెల్లడించింది. అలాగే ఆమె దర్శకుడు విగ్నేష్ శివన్ తోపాటు మూవీకి పని చేసిన ప్రీతమ్ ని కూడా ట్యాగ్ చేసి లవ్ సింబల్స్ జోడించింది. ఇక సమంత మెసేజ్ కి ప్రీతమ్ స్పందించాడు. ఐ లవ్ యూ టూ జిజి అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.