Puneeth Rajkumar : శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణంతో యావత్ సినీ ప్రపంచమే తీవ్ర శోకంలో మునిగింది. సమాజంలో ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగి ఎంతో మందికి ఆసరా కల్పించారు. పునీత్ రాజ్ కుమార్ సేవ అంతులేనిది. ఎంతో మంది సెలెబ్రిటీలు బెంగుళూరు వెళ్ళి ఆయనకు సంతాపం తెలిపి.. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపి వచ్చారు. ఈ క్రమంలో కోలీవుడ్ హీరో విశాల్ లేటెస్ట్ గా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ గురించి, ఆయన విశేషమైన సేవల గురించి విశాల్ తెలిపి ఎమోషనల్ అయ్యారు.
పునీత్ రాజ్ కుమార్ లాంటి గొప్ప వ్యక్తిని తాను చూడలేదని, ఆయన లేరనే విషయాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, ఆయన రూపం ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉందని అన్నారు. విశాల్ నటించిన ఎనిమి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా పునీత్ కు విశాలం నివాళులు అర్పించారు. విశాల్ మాట్లాడుతూ.. పునీత్ రాజ్ కుమార్ మరణం అనేది సినీ పరిశ్రమకు మాత్రమే కాదు.. సమాజానికి కూడా తీరని లోటు. మేకప్ ఉన్నా.. తీసేసినా.. ఎప్పుడూ ఒకేలా మాట్లాడుతారు.
అలాగే పునీత్ ఎంతోమందికి ఉచిత విద్యను అందిస్తున్నారు.. వృద్ధాశ్రమాల్ని నడిపిస్తున్నారు. ఇవన్నీ ఒక్క మనిషి చేశాడంటే చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అలాగే పునీత్ ఇప్పటివరకు చదివించిన 1800 మంది చిన్నారుల్ని తన స్నేహితుడిగా తాను చదివిస్తానని పునీత్ కు మాటిస్తున్నానని అన్నారు. ఈ మాటతో ప్రీ రిలీజ్ ఈవెంట్ షో మార్మోగిపోయింది. ఒక స్నేహితుడిగా నిజమైన నివాళిని అందించిన విశాల్ కు ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఏదో రెండు మాటలతో సరిపెట్టుకోకుండా.. పునీత్ బాధ్యతను తీసుకున్న విశాల్ నిజమైన స్నేహితుడని అనిపించుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…