Viral News : ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అనేక రకాల అరుదైన వ్యాధులతో బాధపడుతుంటారు. కొన్ని వ్యాధులకు చికిత్స ఉండదు. కొన్నింటికి చికిత్స చేస్తే మామూలు మనుషులు అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ ఆ చికిత్స చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ యువతి అలాంటి ఖరీదైన చికిత్స చేయించుకునేందుకు గాను అవసరం అయ్యే డబ్బు కోసం.. దాన్ని సహాయంగా ఇచ్చే దాతల కోసం ఎదురు చూస్తోంది.
యూకేలోని ఇంగ్లండ్‌లో ఉన్న లీడ్స్ అనే ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల ఎమిలీ వెబ్‌స్టర్ కు ఓ అరుదైన వ్యాధి ఉంది. ఆమె 2016లో తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి ఆమె రోజుకు 30 సార్లకు పైగానే వాంతులు చేసుకుంటుంది. ఈమెకు ఉన్న వ్యాధిని వైద్య పరిభాషలో గ్యాస్ట్రోపారెసిస్ అంటారు. ఈ క్రమంలోనే ఆమెకు రోజూ అదే పనిగా వాంతులు అవుతుంటాయి.
అయితే ఈ వ్యాధి అత్యంత అరుదైనదని యూకేకు చెందిన వైద్య నిపుణులు తెలిపారు. యూకేలో 6 శాతం మందికి ఇలాంటి సమస్య వస్తోందని, దీంతో జీర్ణాశయం పాక్షికంగా పక్షవాతం బారిన పడుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే తినే ఆహారం, తీసుకునే ద్రవాలు కిందకు వెళ్లక.. వాంతుల రూపంలో బయటకు వస్తాయని తెలిపారు. అయితే ఈ వ్యాధికి శస్త్ర చికిత్స చేయవచ్చు. దీంతో సమస్య నుంచి బయట పడవచ్చు.
కానీ ఎమిలీకి శస్త్ర చికిత్స చేసేందుకు 9,500 పౌండ్లు (దాదాపుగా రూ.9 లక్షలు) అవసరం. కానీ అంత మొత్తం ఆమె దగ్గర లేదు. దీంతో ఆమె సోషల్ మీడియాలో ఫండ్ రైజర్ ను ప్రారంభించింది. ఆమెకు నవంబర్ 11న శస్త్ర చికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె అప్పటి వరకు ఎలాగైనా సరే ఆ మొత్తాన్ని సేకరించాలని చూస్తోంది. ఈ వ్యాధి వల్ల ఆమె ఇప్పటికే చాలా వరకు బరువు తగ్గింది. ప్రస్తుతం ఆమె బరువు 31 కిలోలుగా ఉంది. అయితే శస్త్ర చికిత్స జరిగితే మళ్లీ మామూలుగా అయ్యేందుకు అవకాశాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె సర్జరీ కోసం ఎదురు చూస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…