Priyanka Singh : బిగ్ బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లకు ఎంతటి పేరు వస్తుందో అందరికీ తెలిసిందే. కొందరు ఆ పేరును నిలబెట్టుకుని వరుస అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఇక ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా ఎంతో పాపులర్ అయిన ప్రియాంక సింగ్‌ను కూడా సినిమా చాన్స్ వరించింది. త్వరలో ఆమె ఓ మూవీలో సందడి చేయనుంది.
బిగ్ బాస్ 5 లో ప్రియాంక సింగ్ తన ఆట తీరుతో అందరినీ అలరించింది. అయితే ఆమె మానస్ వెంట పడడం.. అది ఒక దశలో శృతి మించడంతో కంటెస్టెంట్లకు సైతం ఈమె అంటే విసుగు వచ్చింది. అయినప్పటికీ పోటీలో చివరి వరకు నిలిచి ఆశ్చర్య పరిచింది. ఇక మానస్ టాప్ 5 లో నిలిచాడు. కానీ ప్రియాంక సింగ్ మాత్రం రెండు వారాల ముందే ఎలిమినేట్ అయింది. అయినప్పటికీ ఈ సీజన్‌లో ఈమెకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు.
Coming With Excited One 😍
I Was Really Happy Spending Time With You @konavenkat99 Sir 😇
.
.#PriyankaSingh #priyankapinky #bb5 #biggboss5telugu #Pinkulu #olayolaypinky #vayyari #konavenkat pic.twitter.com/VmitTtDmIZ— Priyankasingh.Official_ (@PriyankasinghO6) January 24, 2022
అయితే తాజాగా ప్రియాంక సింగ్ ను సినిమా ఆఫర్ వరించింది. ప్రముఖ నిర్మాత, రచయిత కోన వెంకట్‌ను ప్రియాంక సింగ్ కలిసింది. తమ మీటింగ్ తాలూకు విషయాలను ప్రియాంక సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే ఓ ఎగ్జయిట్‌మెంట్‌తో రాబోతున్నా.. అంటూ ఆమె ట్వీట్ చేసింది. అయితే ఈమె నటిస్తున్న సినిమా ఏమిటి ? కథ ఏంటి ? వంటి వివరాలన్నింటినీ త్వరలోనే ప్రకటించనున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్‌లో నటిస్తున్న కొందరు మాత్రం సినిమాల్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి ప్రియాంక సింగ్ సక్సెస్ అవుతుందా.. లేదా.. చూడాలి.