Rashmika Mandanna : సినిమా హీరోయిన్లు ధరించే డ్రెస్సులు అప్పుడప్పుడు వివాదాస్పదం అవుతుంటాయి. గ్లామర్‌గా కనిపించాలని వారు చేసే ప్రయత్నాలు బెడిసికొడుతుంటాయి. దీంతో వారికి నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందంగా అనిపిస్తుంటుంది. ఇక రష్మిక మందన్నను అయితే నెటిజన్లు ఎప్పటికప్పుడు ఆడుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా ఆమె ధరించే డ్రెస్సుల పట్ల వారు కామెంట్లు చేస్తూనే ఉంటారు.
తాజాగా రష్మిక మందన్న ధరించిన డ్రెస్‌పై మరోమారు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నడుం వరకు మాత్రమే టాప్ ధరించి, కింద షార్ట్ ధరించిన రష్మిక మందన్న తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షం అయింది. అయితే ఆమె ఇలాంటి డ్రెస్‌లను ధరించడం కొత్త కాదు. కానీ ఆమె ధరించిన డ్రెస్ పట్ల నెటిజన్లు అనేక రకాల కామెంట్లు చేస్తున్నారు. ఆమెను విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
https://twitter.com/MandannaTeam/status/1485538698771206144
కింద చలివేయడం లేదా.. ప్యాంట్ ధరించడం మరిచిపోయావా.. అంటూ రష్మికను ట్రోల్ చేస్తున్నారు. కాగా రష్మికకు చెందిన ఆ వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈమె తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంది.
రష్మిక ప్రస్తుతం తెలుగులో ఆడవాళ్లు మీకు జోహార్లు, పుష్ప 2 సినిమాల్లో నటిస్తుండగా.. హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలు చేస్తోంది. ఇటీవల విడుదలైన పుష్ప మొదటి పార్ట్‌లో రష్మిక నటనకు, డ్యాన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి.