Sreeja Kalyan : సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సెలబ్రిటీ దంపతుల విడాకులపైనే చర్చ ఎక్కువగా నడుస్తోంది. ఇక ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్స్ విడాకులు తీసుకున్నారు. మెగా డాటర్ శ్రీజ, కల్యాణ్ దేవ్‌లు కూడా విడాకులు తీసుకుంటారని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అందుకు తగిన విధంగానే శ్రీజ తన ఇంటి పేరును మార్చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది.
ఇక మెగా ఫ్యామిలీ ఈ మధ్య కాలంలో కలసి సెలబ్రేట్ చేసుకున్న వేడుకల్లోనూ కల్యాణ్ దేవ్ ఎక్కడా కనిపించలేదు. అతని తాజా మూవీ సూపర్ మచ్చిని సైతం మెగా ఫ్యామిలీ ప్రమోట్ చేయడం లేదు. దీంతో శ్రీజ, కల్యాణ్ దేవ్‌ల విడాకులు ఖాయమని వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ సైలెంట్‌గా ఉండడం విశేషం.
సాధారణంగా తమకు సంబంధించిన ఏ విషయం అయినా సరే పెద్ద ఎత్తున వార్తలు వస్తే సెలబ్స్ స్పందించి వాటిని ఖండిస్తారు. కానీ అటు చిరంజీవి గానీ, ఇటు మెగా వర్గాలు కానీ శ్రీజ దంపతుల విడాకుల వార్తను ఖండించలేదు. దీనిపై అందరూ మౌనంగానే ఉన్నారు.
అయితే త్వరలోనే చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తారని, అప్పటి వరకు మౌనంగా ఉండమని ఫ్యామిలీకి చెప్పారట. అందుకనే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. ఇక మీడియా సైతం కల్యాణ్ దేవ్ కొత్త సినిమా సూపర్ మచ్చిని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.