Poorna : కేరళ కుట్టి పూర్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమారుగా 12 సంవత్సరాలు అవుతోంది. ఈమె గత దశాబ్ద కాలం నుంచి ఎన్నో చిత్రాలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా బుల్లితెరపై పలు కార్యక్రమాలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా ఈమె బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ సినిమాలో నటించింది. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుండడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈమె మీడియాతో ముచ్చటించింది.
ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ.. ఇలాంటి పెద్ద సినిమాల్లో తనకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. నా లక్కీ నెంబర్ 5, 2021 ని కూడితే ఐదు వస్తుంది కనుక ఈ ఏడాది తనకు మంచి సినిమా అవకాశాలు వచ్చాయని ఈ సందర్భంగా ఆమె తెలిపింది. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. సెలబ్రిటీలు పబ్లిక్ ప్రాపర్టీ అని నా ఫీలింగ్.. అంటూ ఈమె చెప్పుకొచ్చింది.
ప్రజల వల్లే సెలబ్రిటీలం అవుతాము, ఈ క్రమంలోనే కొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటారు, మరికొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇలా నెగెటివ్ కామెంట్స్ చేయడం వల్ల నన్ను నేను ఎంతగానో మార్చుకున్నానని.. ఈ సందర్భంగా పూర్ణ వెల్లడించింది.
ఇక అఖండ సినిమా డిసెంబర్ 2వ తేదీ విడుదల కానుందని, ఈ సినిమాలో తన పాత్ర కూడా అంతే అద్భుతంగా ఉంటుందని, ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…