Nagarjuna : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో కుటుంబంగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగార్జున 60 సంవత్సరాల వయస్సు దాటినా ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ తన కంటూ ఒక హిట్ సినిమాని దక్కించుకోలేకపోతున్నారు.
ఇక గత కొద్ది సంవత్సరాల నుంచి నాగార్జునకు బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా తర్వాత ఆయన నటించిన ఎలాంటి చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేదు. అదేవిధంగా తన పెద్ద కొడుకు నాగచైతన్య విడాకుల విషయంతో నాగార్జున కుటుంబం మరికొన్ని చిక్కుల్లో పడింది. ఇదిలా ఉండగా తాజాగా సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ చిత్రంగా బంగార్రాజు అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి నాగార్జున అన్నపూర్ణ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా అనుకున్న దాని కన్నా అధిక బడ్జెట్ అవడంతో నాగార్జున ఎంతో కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. అసలే గత కొన్ని సంవత్సరాల నుంచి హిట్లు లేక సతమతమవుతున్న నాగార్జున ప్రస్తుతం ఈ సినిమాకు అధిక బడ్జెట్ కావడంతో ఈ సినిమా విజయం సాధిస్తుందా.. లేదా.. అని టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. ఇక ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…