Payal Rajput : ఆర్ఎక్స్100 అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ పాయల్ రాజ్‌పూత్. ఈ అమ్మడికి అసలు ఇప్పుడు ఆఫర్లు అంతగా లేవు. కానీ తరచూ వార్తల్లో మాత్రం నిలుస్తుంటుంది. అప్పుడప్పుడు తన అందాల ఆరబోత ఫొటోలను ఈమె షేర్ చేస్తుంటుంది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. ఇక గతంలో ఈమె ఒకసారి పసుపు రంగు బ్లేజర్ ధరించి పైభాగంలో ఇంక లోపల ఏమీ వేసుకోకుండా.. అలాగే ఫొటోషూట్ చేసింది. దీంతో చూపించకూడని అందాలను చూపించేసింది. తరువాత జరిగిన తప్పు తెలుసుకుని తన వీడియోను డిలీట్ చేసింది. కానీ అప్పటికే ఆ వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలోనే దానిపై పాయల్ తరువాత సంజాయిషీ ఇచ్చుకుంది. అందరు మహిళలకు ఉన్నట్లుగానే తనకూ అవి ఉన్నాయని.. అందులో సిగ్గు పడాల్సిందేముంది ? అంటూ రివర్స్‌లో వచ్చింది. ఇక ఆ విషయం అంతటితో సద్దుమణిగింది.
అయితే ఇప్పుడు మరోమారు పాయల్ రాజ్‌పూత్ వార్తల్లో నిలిచింది. ఆమెకు చెందిన వీడియో వైరల్‌గా మారింది. స్టేజిపై అందరూ చూస్తుండగానే ఆమె తన ప్రియుడు సౌరభ్ దింగ్రాకు లిప్‌లాక్ ఇచ్చింది. జీ తెలుగు వారు నిర్వహించనున్న జీ మహోత్సవం అనే కార్యక్రమంలో భాగంగా తన ప్రియుడితో కలసి డ్యాన్స్ చేసిన పాయల్ రాజ్‌పూత్ డ్యాన్స్ అయిపోగానే స్టేజిపై అందరూ చూస్తుండగానే తన ప్రియుడికి లిప్ టు లిప్ కిస్ ఇచ్చి అందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే ఆ సమయంలో సౌరభ్ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యాడు. పాయల్ చేసిన పనికి అతను ఖంగు తిన్నాడు. కాగా ఈ కార్యక్రమానికి చెందిన ప్రోమోను లేటెస్ట్‌గా విడుదల చేయగా.. అది వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. దీంతో అసలు ఏం జరిగింది ? అనే విషయంపై క్లారిటీ రానుంది.

ఇక పాయల్ రాజ్‌పూత్ గతంలోనూ తన ప్రియుడితో కలిసి అనుచితి రీతిలో ఫొటో దిగింది. ఆమె కోటు లోపల ప్రియుడు చేయి పెట్టి ఉన్న ఫొటోను ఆమె షేర్ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి ప్రైవేట్‌గా ఉంచుకోవాలి కానీ.. ఇలా పబ్లిగ్గా షేర్ చేస్తారా.. అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఇక ఇప్పుడు పాయల్ రాజ్‌పూత్ చేసిన పనికి మరోమారు నెటిజన్లు షాకవుతున్నారు. అయితే ఈ సారి వారు ఆమెను ఏమంటారో చూడాలి.