Viral Video : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం.. సర్కారు వారి పాట. ఈ మూవీ తొలి రెండు, మూడు రోజులు నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకున్నా క్రమంగా పుంజుకుంటోంది. సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ మూవీని ఆదరిస్తున్నారు. ఇక ఈ మూవీ హిట్ కావడంతో మహేష్ ఫ్యాన్స్ పడుతున్న ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఓ చానల్ పనిగట్టుకుని మరీ మహేష్ సినిమాపై బురదజల్లడం ప్రారంభించింది. దీంతో ఆ చానల్‌ను మహేష్ ఫ్యాన్స్ చెడుగుడు ఆడుకున్నారు. ఒక రేంజ్‌లో ఆ చానల్‌ను ట్రోల్ చేశారు. దీంతో ఆ చానల్ దిగివచ్చి క్షమాపణలు చెప్పక తప్పలేదు.
ఇక సర్కారు వారి పాట చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి. ముఖ్యంగా పాటలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. మొదట్లో రిలీజ్ చేసిన కళావతి పాట అయితే ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. అలాగే సర్కారు వారి పాట టైటిల్ సాంగ్, పెన్నీ సాంగ్‌తోపాటు చివర్లో రిలీజ్ చేసిన మ.. మ.. మహేషా.. అనే పాట కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక మహేషా పాటకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేశారు. అయితే మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. లేటెస్ట్‌గా ఓ యువతి ఈ పాటకు డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఈ క్రమంలోనే ఆమె డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది.

మహేషా పాటకు ఓ యువతి అదిరిపోయే రీతిలో డ్యాన్స్ చేసింది. సినిమాలో కీర్తి సురేష్ చేసినట్లుగానే ఆమె కూడా చేయడం విశేషం. ఈ వీడియోకు ఇప్పటికే 2800కు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మహేష్ బాబు త్వరలోనే త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయనున్నారు. ఇందులో పూజా హెగ్డె నటించనుంది. తరువాత 2023లో రాజమౌళితో సినిమా ప్రారంభం అవుతుంది. దీని కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
View this post on Instagram