Nagababu : నాగబాబు కేవలం నటుడిగానే కాదు.. నిర్మాతగా కూడా గతంలో పలు సినిమాలు తీసిన విషయం విదితమే. ఇప్పుడు ఆయన నిర్మాతగా వ్యవహరించడం లేదు. కానీ గతంలో ఆయన పలు హిట్ చిత్రాలు నిర్మించారు. తన తల్లి అంజనా దేవి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్‌ను స్థాపించిన నాగబాబు ఆ బ్యానర్‌పై రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్, స్టాలిన్, ఆరెంజ్ లాంటి చిత్రాలను నిర్మించారు. అయితే రామ్ చరణ్‌తో తీసిన ఆరెంజ్ మూవీ ఆయనకు భారీ నష్టాలను తెచ్చి పెట్టింది. దీంతో ఆయన మళ్లీ నిర్మాతగా వ్యవహరించలేదు.
అయితే నాగబాబును మళ్లీ నిర్మాతగా మార్చేందుకు అల్లు అర్జున్ గతంలో యత్నించాడు. అందులో భాగంగానే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నాగబాబు ఇంకో భాగస్వామిగా ఉన్నారు. కానీ అది కూడా ఫ్లాప్ అయింది. దీంతో మళ్లీ నాగబాబు నిర్మాతగా మారలేదు. నటుడిగానే కొనసాగుతున్నారు. టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన నిర్మాతగా ఉన్నప్పుడు చేసిన సినిమాల వల్ల భారీగా నష్టాలు వచ్చి అప్పుల పాలయ్యారు. అందుకనే ఇక నిర్మాతగా ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే ఆయన మళ్లీ నిర్మాతగా మారనున్నారు. అది కూడా తన కుమారుడు వరుణ్ తేజ్ సినిమాకే కావడం విశేషం.

వరుణ్ తేజ్ నటించిన ఎఫ్3 మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ అనంతరం వరుణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పేశారు. ప్రవీణ్ సత్తారుతో కలిసి ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నట్లు చెప్పారు. జూలై నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే వరుణ్‌తో తొలిప్రేమ సినిమా తీసిన బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీకి ఒక నిర్మాతగా వ్యవహరించనున్నారు. అలాగే ఇందులో నాగబాబు కూడా ఇంకో నిర్మాతగా ఉండనున్నారు. దీంతో నాగబాబు త్వరలోనే మళ్లీ నిర్మాతగా మారనున్నారన్నమాట. అయితే నిర్మాతగా అపజయాలను ఎదుర్కొన్న నాగబాబుకు ఈసారి ఏమవుతుంది.. ఆయన మళ్లీ నిర్మాతగా హిట్ కొడతారా.. అన్న విషయం తెలియాల్సి ఉంది.