F3 Movie Review : అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2కు సీక్వెల్‌గా వచ్చిన మూవీ ఎఫ్3. ఈ మూవీ నేడు (మే 27, 2022) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే రాజేంద్ర ప్రసాద్, సునీల్, ఇతరులు కూడా నటించారు. అయితే ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఎఫ్3 మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా.. అసలు సినిమా ఎలా ఉంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
వెంకీ (వెంకటేష్), వరుణ్ యాదవ్ (వరుణ్ తేజ్)లు మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు. డబ్బు సంపాదించేందుకు అనేక కష్టాలు పడుతుంటారు. ఈ క్రమంలోనే ఒక రోజు విజయనగరానికి చెందిన ఓ పారిశ్రామిక వేత్త, సంపన్నుడు తన వారసుడి కోసం ఎదురు చూస్తున్నాడని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న వెంకీ, వరుణ్ యాదవ్‌లు తామే ఆ వారసులమని అతని వద్దకు వెళ్తారు. అయితే చివరకు ఏమవుతుంది ? కథ ఎలాంటి మలుపులు తిరిగింది ? డబ్బు సంపాదించాలనుకునే వెంకీ, వరుణ్ యాదవ్‌ల కోరిక నెరవేరిందా ? అన్న వివరాలను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
ఇక ఈ మూవీలో నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. కామెడీని పండించడంలో వెంకటేష్ ముందుంటారని చెప్పవచ్చు. ఆయన అద్భుతమైన టైమింగ్‌తో చెప్పే డైలాగ్‌లు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ మూవీలో ఆయన రేచీకటి ఉన్న వ్యక్తిగా అద్భుతంగా నవ్వించారు. అలాగే వరుణ్ కూడా చక్కని పెర్ఫార్మెన్స్‌ను ఇచ్చాడు. తమన్నా, మెహ్రీన్ ల గ్లామర్ షో సరేసరి. అలాగే ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు.
అద్భుతమైన కామెడీ చిత్రాలను తీయడంలో దర్శకుడు అనిల్ రావిపూడి పేరుగాంచారు. కనుక ఆయన పనితనం ఈ మూవీలోనూ కనబడుతుంది. ప్రేక్షకుల సీట్లలో కూర్చోకుండా కడుపుబ్బా నవ్వుతారు. అలాగే ఫొటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు వంటి అన్ని అంశాలు బాగున్నాయి. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే.. ఎఫ్2 లాగే ఎఫ్3 కూడా ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందిస్తుందని చెప్పవచ్చు. ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.