Naga Chaitanya : అక్కినేని వారసుడు నాగ చైతన్య ఇటీవల రెండు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలని తన ఖాతాలో వేసుకున్న చైతూ థాంక్‌యూ అనే సినిమాతో పలకరించేందుకు సిద్ధమయ్యాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో మహేష్ అభిమానిగా చైతూ కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్ పూర్తై చాలా రోజులే అవుతున్నా కూడా ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు.

ఈ విషయమై అక్కినేని కాంపౌండ్‌ని అభిమానులు సంప్రదిస్తున్నా వారికి సరైన సమాధానం రావడంలేదట. ఒకవేళ సినిమా అటకెక్కిందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో మంచి హిట్ కొట్టిన చైతూ అదే ఊపులో ఈ సినిమాని కూడా తీసుకొస్తే బాగుండేదని అక్కినేని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జూన్ లేదా జూలైలో సినిమాని తీసుకురానున్నారని కొందరు చెబుతున్నారు. ఇందులో ఎంత నిజం ఉందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. థాంక్‌యూ విషయంలోనే కాదు, విరాట పర్వం సినిమా విషయంలో కూడా ఇదే తరహా గందరగోళం నడుస్తోంది.
అమీర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చద్ధా సినిమాతో చైతూ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా మరి కొద్ది రోజులలో విడుదల కాబోతోంది. ఇక ప్రస్తుతం చైతూ ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా నాగచైతన్య రెండో పెళ్లికి సంబంధించి ఇటీవల పలు వార్తలు బయటకు రాగా, వాటిని చైతూ టీం కొట్టి పారేసింది. అవన్నీ పుకార్లేనని తేల్చేసింది.