Suman : హీరో సుమన్ ఒకప్పుడు ప్రేక్షకులని ఎంతగా అలరించే వారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలలో ఆయన ఒకరుగా ఉండేవారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వశక్తితో కష్టపడి సినిమా అవకాశాలను అందుకుంటూ వచ్చిన హీరోల్లో సుమన్ ఒకరు. 80, 90 దశకాల్లో చిరంజీవికి ఈయన సమ ఉజ్జీగా నిలుస్తూ రాణించారు. వీరిద్దరి మధ్య వైరం ఉందని ఎప్పటి నుండో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ.. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు.. లాంటి హీరోల తర్వాత నెక్స్ట్ బ్యాచ్ నేను, చిరంజీవి గారే.. ఆ తర్వాతే ఇండస్ట్రీకి వెంకటేష్, నాగార్జున వచ్చారు అని చెప్పారు.

అప్పట్లో పోటీ అనేది తనకు, చిరంజీవి గారికి మధ్యనే ఉండేదని అన్నారు. అయితే ఎవరికి వారికి ప్రత్యేకమైన కాంపౌండ్ ఉండేదని, రెండు గ్రూప్స్ ఉండేవని తెలిపారు. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు, తమ మధ్య హెల్దీ కాంపిటేషన్ ఉండేదని సుమన్ చెప్పారు. అయితే తాజాగా సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు కమలహాసన్ గారు అంటే చాలా ఇష్టం. అయినా డాన్స్ విషయానికొస్తే చిరంజీవి గారి డాన్స్ నచ్చుతుందన్నారు.
చిరంజీవి గారు నేల చూడకుండా డాన్స్ చేస్తారు. ఆయన డాన్స్ చేసేటప్పుడు ఆయన బాడీలో ఒక రిథమ్ ఉంటుంది.. ఒక గ్రేస్ ఉంటుంది. చాలా మంది కుర్రాళ్లు ఇప్పుడు అంతకంటే ఫాస్టుగా చేస్తున్నారు. అయితే వాటిలో జిమ్నాస్టిక్స్ ఎక్కువగా ఉంటున్నాయి. చిరంజీవి తరువాత అంత బాగా డాన్స్ చేసే హీరోగా ఎన్టీఆర్ కనిపిస్తాడు అని చెప్పుకొచ్చారు. కాగా, సుమన్ యాక్షన్ సినిమాల నుంచి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందారు. ఇప్పటి సీనియర్ హీరోలకు ఒకప్పుడు ఆయన గట్టిపోటీ ఇచ్చారు. ప్రస్తుతం సుమన్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు.