ఏ మాయ చేశావే సినిమాలో జంటగా నటించిన అక్కినేని నాగచైతన్య, సమంత నిజ జీవితంలో కూడా ఒక్కటయ్యారు. అయితే పెళ్లి చేసుకున్న కొన్నేళ్లకే తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. తాజాగా అమీర్ ఖాన్, నాగ చైతన్య కలిసి నటించిన లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ కోసం మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న సందర్భంగా నాగచైతన్య తన చేతిపై ఉన్న టాటూపై స్పందించాడు. ఆ టాటూ సమంతకి సంబంధించింది. వారి పెళ్లి రోజున నాగ చైతన్య చేతిపై టాటూగా వేయించుకున్నాడు. వీరిద్దరూ విడిపోయినప్పటికీ ఆ టాటూ చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఆ టాటూని తొలగిస్తారా అని ప్రశ్నించగా.. ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదని నాగచైతన్య తెలిపాడు. తమ వెడ్డింగ్ డేట్ ని మోర్స్ కోడ్ రూపంలో టాటూ వేయించుకున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్య ఫ్యాన్స్ కి ఓ సలహా ఇచ్చారు. కీలకమైన పర్సనల్ డీటెయిల్స్ ని టాటూగా వేయించుకోవద్దని సూచించాడు. భవిష్యత్తులో అవి మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి టాటూల జోలికి వెళ్ళొద్దని తెలిపాడు.
సమంత కూడా తన బాడీపై నాగ చైతన్యకి సంబంధించిన టాటూ వేయించుకుంది. ఇటీవల సామ్ కూడా.. జీవితంలో ఎప్పుడూ టాటూ వేయించుకోకూడదని సలహా ఇచ్చింది. విడిపోయిన తర్వాత సమంత, నాగ చైతన్య ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు.
ఇక సినిమాల విషయానికి వస్తే నాగ చైతన్య లాల్ సింగ్ చడ్డా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రంతో నాగచైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ స్నేహితుడు బాలరాజు పాత్రలో చైతూ నటిస్తున్నాడు. తర్వాత సర్కారు వారి పాట ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కూడా ఒక చిత్రానికి చైతూ కమిట్ అయ్యాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…