ఈ నెల 12వ తేదీన యాక్షన్ థ్రిల్లర్ గా మాచర్ల నియోజకవర్గం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నితిన్. ఈ చిత్రంలో కృతి శెట్టి నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికిగాను ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కేథరిన్, రాజేంద్రప్రసాద్, ఇంద్రజ, మురళీ శర్మ, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మాచర్ల నియోజకవర్గం చిత్రానికి స్వర సాగర్ మహతి సంగీత దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇక చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంది.
మాచర్ల నియోజకవర్గం చిత్ర ట్రైలర్ లో అందరినీ ఆకట్టుకున్నది అంజలి, నితిన్ కలిసి చేసిన ఐటమ్ సాంగ్. రా రా రెడ్డి అనే ఐటమ్ సాంగ్ లో హీరోయిన్ అంజలి, నితిన్ కలిసి స్టెప్పులు వేయగా.. ఈ పాట మిలియన్ వ్యూస్ దక్కించుకుని సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. ఈ పాట చివర్లో నితిన్ నటించిన జయం చిత్రంలోని రాను రానంటూనే చిన్నదో అనే పాటను జోడించారు. ఈ ఐటమ్ సాంగ్ కు ఇది హైలెట్ గా నిలిచింది.
నెటిజన్లు సైతం తమదైన స్టైల్‌లో రా రా రెడ్డి సాంగ్ కు నితిన్, అంజలి లా డాన్స్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ పాటకు సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు. తాజాగా టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ కూడా రాను రానంటూనే చిన్నదో అంటూ స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో తన వీడియోను పోస్ట్ చేసింది.
ఫుల్ జోష్ తో ధనశ్రీ చేసిన డాన్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్లను సైతం ఫిదా చేస్తోంది. నితిన్, అంజలి మాదిరిగా ధనశ్రీ కూడా కంప్లీట్ సింక్ లో స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…