సూపర్ స్టార్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి. ఆయనే మన డేరింగ్ అండ్ డైనమిక్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. 1965 లో తేనెమనసులు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు కృష్ణ. అప్పట్లో ఆయన నటించిన చిత్రాలు సెన్సేషనల్ హిట్ గా నిలిచేవి. తెలుగుతెరకు తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్ చిత్రాలను పరిచయం చేసిన వ్యక్తి కృష్ణ. ఈస్ట్ మన్ కలర్ ను కూడా పరిచయం చేసిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. అందుకే ఈయనను నంబర్ వన్ హీరో అని పిలుస్తారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి పెద్ద హీరోలను ఢీ కొడుతూ ఆయన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించేవి. తెలుగు ఇండస్ట్రీకీ మూల స్తంభంగా నిలిచిన వారిలో కృష్ణ కూడా ఒకరు. కృష్ణ 1943 మే 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని బుర్రిపాలెం అనే గ్రామంలో జన్మించారు. 20 ఏళ్ల వయసులో నటనపై మక్కువతో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. దాదాపుగా 350 చిత్రాల్లో నటించడమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కృష్ణ అద్భుతమైన ప్రతిభను కనబరిచారు.
ఇప్పటి హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడం కష్టంగా ఉంది. కానీ కృష్ణ ఒకే సంవత్సరంలో 18 చిత్రాలలో నటించిన రోజులు కూడా ఉన్నాయి. అలా ఉండేది కృష్ణ కమిట్‌మెంట్ ఆ రోజుల్లో. ఆ రోజుల్లో కేవలం ఇండోర్ షూటింగ్ లే ఎక్కువగా ఉండేవి. దాదాపు చిత్రాలు మొత్తం స్టూడియోలలోనే సెట్లు వేసి షూటింగ్ పూర్తి చేసేవారు. అందుకే హీరోలు షిఫ్ట్ ప్రకారం ఒక చిత్రం తర్వాత ఒకటి నటిస్తూ పారితోషకం అందుకునేవారు.
1972లో కృష్ణ నటించిన 18 చిత్రాలు ఏకంగా ఒకే సంవత్సరం విడుదల అవడం విశేషం. రాజమహల్ (HIT), మొనగాడొస్తున్నాడు జాగ్రత్త (HIT), అంతా మనమంచికే (Super Hit), గూడుపుఠాని (Flop), మా ఊరి మొనగాళ్ళు (Super Hit), మేన కోడలు (Average), కోడలు పిల్ల (Average), భలే మోసగాడు(Super Hit), పండంటికాపురం (Block Buster), హంతకులు దేవాంతకులు (Super Hit), నిజం నిరూపిస్తా (Flop), అబ్బాయిగారు అమ్మాయిగారు (Super Hit), ఇన్‌స్పెక్టర్ భార్య (Average), మా ఇంటి వెలుగు (Average), ప్రజా నాయకుడు (Super Hit), మరపురాని తల్లి (Super Hit), ఇల్లు ఇల్లాలు (Super Hit), కత్తుల రత్తయ్య (Super Hit) వంటి సినిమాలు ఒకే ఏడాది వరుస పెట్టి విడుదల చేయడం విశేషం.
ఈ ఘనత ఒక కృష్ణకే దక్కింది. విడుదలైన ఈ సినిమాలలో దాదాపుగా 80 శాతం హిట్ అయ్యాయి. ప్రేక్షకులు కూడా వరుసగా విడుదలైన కృష్ణ చిత్రాలను ఆదరించడం కూడా ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటి హీరోలు పాన్ ఇండియా చిత్రాలు అంటూ ఒక సినిమానే సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటే, కృష్ణ అప్పట్లోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సినిమాలను విడుదల చేశారు. K.S.R దాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మళయాళం, బెంగాలీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా విడుదల అవడంతోపాటు హాలీవుడ్ లో కూడా విడుదలైంది.
రష్యన్, స్పానిష్ వంటి భాషల్లో కూడా విడుదలైన టాలీవుడ్ మొదటి చిత్రం మోసగాళ్లకు మోసగాడు. ప్రపంచంలో అత్యధిక భాషల్లో విడుదలైన భారత చిత్రంగా మోసగాళ్లకు మోసగాడు ఆ రోజుల్లో ప్రభంజనం సృష్టించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…