ప్రస్తుతం సామాన్యుల నుంచి సెలబ్రెటీస్ వరకు ఎవరు ఏది చెప్పాలనుకున్నా సోషల్ మీడియానే వేదికగా వాడుకుంటున్నారు. సోషల్ మీడియా ఇప్పుడు అత్యంత శక్తివంతమైన ప్రసార సాధనంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో ఇన్‌స్టాగ్రామ్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఫ్యామిలీ, కెరీర్ విషయాలను షేర్ చేసుకోవచ్చు. సామాన్యులు సైతం దీన్ని వాడడం, ఫాలో అవుతున్న సమయంలో రానా దగ్గుబాటి మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్ నుంచి తప్పుకున్నారు.
గత ఐదు రోజు క్రితం సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటున్నా అని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన పోస్ట్ లన్నీ డిలీట్ చేశారు. ఫోటోలతో సహా ఇన్‌స్టా మొత్తం డిలీట్ చేశారు. కొంతకాలం సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటున్నానని, ఇది చాలా ఉత్తమమైన, శక్తివంతమైన నిర్ణయమని, మంచి సినిమాలతో కలుద్దామని చెప్పారు.
మీపై అమితమైన ప్రేమతో అని ఇటీవల రానా ట్విట్టర్‌లో పేర్కొన్న విసయం తెలిసిందే. కేవలం ఇన్‌స్టాగ్రామ్‌కి దూరంగా ఉంటారా ? ట్విట్టర్ కూడా దూరమవుతారా ? అనేది సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉండగా.. సినిమాల విషయంలో ఆయన బ్రేక్ తీసుకుంటున్నాడా ? లేక వ్యక్తిగతంగా ఏవైనా ఇబ్బందులా ? అనేది ప్రశ్నగా మారింది. రానా రెండేళ్ల క్రితం మ్యారేజ్ చేసుకున్నారు. ప్రియురాలు మిహీకా బజాజ్ ని ఆయన 2020లో కరోనా సమయంలో మే 20న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఆయన, ఆగస్ట్ 8న మ్యారేజ్ చేసుకున్నారు.
సోమవారంతోనే వీరి పెళ్లి అయి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి రానా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లన్నీ డిలీట్ చేయడం మరింత అనుమానాలకు తావిస్తోంది. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ మిహీకా ఇద్దరూ కలిసున్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి అందరి అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇటీవల విడుదలైన విరాట పర్వం మూవీకి ఆశించిన ఫలితం రానప్పటికీ రానా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…