టాలీవుడ్ నిర్మాతలు బడ్జెట్ పెరిగి పోతుంది. సినిమాలను నిర్మించడం మా వల్ల కావడం లేదు బాబోయ్ అంటూ సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ లు నిలిచి పోయి వారం రోజులు అవుతోంది. షూటింగ్ లు మళ్లీ ఎప్పుడు పునః ప్రారంభం అవుతాయి అనేది ఎవరికీ క్లారిటీ లేదు. షూటింగ్ లను ప్రారంభించాలంటే హీరోల పారితోషికాలు తగ్గించుకోవాల్సిందే. వారి భారీ ఖర్చులు తగ్గించుకోవాల్సిందే.. అంటూ డిమాండ్ చేస్తున్నారు.
షూటింగ్ లు ప్రారంభం అయ్యేది ఎప్పుడో తెలియడం లేదు కానీ మరో వైపు హీరోలు తమ పారితోషికాలు మాత్రం మరింతగా పెంచేస్తూనే ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమా దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఇక ప్రాజెక్ట్ కే ఒక అంతర్జాతీయ సినిమా కనుక అంతకు మించిన బడ్జెట్ ఉంటుంది. ఈ రెండు సినిమాల షెడ్యూల్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల కచ్చితంగా రూ.20 కోట్ల నుండి రూ.25 కోట్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
అంతే కాకుండా ప్రభాస్ డేట్లు వృథా అవుతుండడంతో రూ.5 నుండి రూ.10 కోట్ల వరకు నష్టం అని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి టాలీవుడ్ నిర్మాతల బంద్ వల్ల ఇండస్ట్రీలో అత్యధికంగా ఎఫెక్ట్ అవుతున్న హీరో ప్రభాస్ అని చెప్పవచ్చు. ఈ సమ్మె ఎప్పటికి ఆగి పోయేనో.. ఎప్పుడు షూటింగ్ లు పూర్తి స్థాయిలో జరిగేనో చూడాలి. ఈ సమ్మెతో హీరోలు దిగివస్తారో లేదా నిర్మాతలే సమ్మె విరమించుకుంటారో వేచి చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…