Mokshagna : అఖండ మూవీ సక్సెస్ అనంతరం నందమూరి బాలకృష్ణ పలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్‌బీకే107 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ చేస్తున్నారు. ఇందులో బాలయ్య పక్కన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మూవీకి అన్నగారు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ అవగానే బాలయ్య మళ్లీ వరుస సినిమాలు చేయనున్నారు.
గోపీచంద్ మలినేని సినిమా పూర్తవ్వగానే అనిల్ రావిపూడితో కలిసి సెప్టెంబర్ 2022 నుంచి బాలయ్య ఓ మూవీ చేస్తారు. ఇందులో ఆయన 50 ఏళ్ల వయస్సు ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బాలకృష్ణ కుమార్తెగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటించనున్నట్లు సమాచారం. అయితే తాజాగా బాలకృష్ణ ఫ్యామిలీకి చెందిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఆయన భార్య వసుంధర దేవి, కుమార్తె బ్రాహ్మణిలతోపాటు కుమారుడు మోక్షజ్ఞను కూడా చూడవచ్చు.

అయితే గతంలో ఒకసారి మోక్షజ్ఞ ఫొటో ఒకటి ఇలాగే బయటకు వచ్చింది. అప్పట్లో అతను షాకింగ్ లుక్‌లో కనిపించాడు. బాగా లావుగా.. పొట్టతో దర్శనమిచ్చాడు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు అలా లేకపోయినా.. ఇంకా లావుగానే మోక్షజ్ఞ ఉన్నాడు. దీంతో ఫ్యాన్స్ మళ్లీ కలవరపడుతున్నారు. అయితే ప్రస్తుతం అతను ఇంకా చదువుకుంటూనే ఉన్నాడని.. కానీ సినిమాల్లోకి వచ్చే వరకు స్లిమ్‌గా, ఫిట్‌గా అవుతాడని తెలుస్తోంది. ఇక మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు.. అనే విషయంపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ఒకప్పటి బాలకృష్ణ హిట్ చిత్రం ఆదిత్య 369కు సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని సమాచారం. దీనిపై కూడా క్లారిటీ రావల్సి ఉంది.