Aishwarya Rai : బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సహజసిద్ధమైన అందాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచ సుందరి కిరీటాన్ని సాధించినప్పటి నుంచి ఈమె దశ తిరిగిపోయింది. అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అయితే ప్రస్తుతం వయస్సు అయిపోతున్న కారణంగా.. తల్లి అవడం వల్ల ఐశ్వర్యారాయ్ ముఖంలో గతంలో ఉన్న అందం లేదు. ఈ క్రమంలోనే ఆమెకు కాస్త వృద్ధాప్య ఛాయలు వచ్చినట్లు కనిపిస్తోంది.
అయితే ఇటీవల కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న ఐశ్వర్యారాయ్ పలు రకాల వెరైటీ దుస్తులను ధరించి మెరిసింది. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఆమె క్లోజప్ ఫొటోలు చూసి నెటిజన్లు షాకయ్యారు. ఆమె ముఖం అంతా అదో మాదిరిగా మారిపోయింది. దీంతో నెటిజన్ల నోళ్లకు పని దొరికింది. వారు ఆమెను తీవ్రంగా విమర్శిస్తూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

సహజసిద్ధంగానే అందంగా ఉండే నువ్వు.. ఇలా కనిపించడం ఏమిటి.. ముఖం అంతా అదోలా మారిపోయింది.. ఇది మేకప్ ఎఫెక్టా.. లేకపోతే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావా.. చాలా ఛండాలంగా ఉన్నావు.. అంటూ నెటిజన్లు ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. ఇక ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం సినిమాల్లో అంతగా నటించడం లేదు. ఎప్పుడో ఒకటో రెండో మూవీల్లో ఈమె నటిస్తోంది. ఇక ప్రస్తుతం ఈమె పొన్నియిన్ సెల్వన్ అనే తమిళ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ రెండు పార్ట్‌లుగా రానుంది. మొదటి పార్ట్‌ను ఈ ఏడాది చివర్లో.. రెండో పార్ట్‌ను వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.