Pawan Kalyan : జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి పవన్ కల్యాన్ అలుపెరగకుండా యాక్టివ్‌గా రాజకీయాల్లో పనిచేస్తూ వస్తున్నారు. అయితే ఆయన గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ రెండు చోట్లా ఓడారు. అయినప్పటికీ మనోధైర్యం కోల్పోకుండా ప్రజల మధ్య తిరుగుతూ వారి కష్ట నష్టాలను తెలుసుకుంటున్నారు. అయితే పవన్ తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రాజకీయంగా ఏదైనా సవాల్ విసిరితే దాన్ని స్వీకరిస్తారా.. అన్న ప్రశ్నకు పవన్ బదులిస్తూ.. సవాల్ విసిరిన వ్యక్తికి జ్ఞానం ఉందా.. ఎలాంటి ప్రశ్న వేశాడు.. అందులో న్యాయం ఉందా.. అనిపిస్తే తప్పక ఆ సవాల్‌ను స్వీకరిస్తానని చెప్పారు. ఇక ప్రస్తుతం తాను అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నానని.. వారి కష్ట నష్టాలను తెలుసుకుంటున్నానని.. దీంతో తనకు సరైన అవగాహన వస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలంటే ముందుగా వాటిని తెలుసుకోవాలని అన్నారు.

అయితే రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. ఈ సారి ఓడితే ఏం చేస్తారు.. అన్న ప్రశ్నలకు బదులిస్తూ.. రానున్న ఎన్నికల గురించి ఇంకా ఏమీ అనుకోలేదని.. అప్పటి పరిస్థితిని బట్టి తాను పోటీ చేసే స్థానాలను నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు. అలాగే రాజకీయాల్లో ఉన్నవారికి గెలుపోటములు సహజమని.. అంత మాత్రం చేత డీలా పడిపోవాల్సిన పనిలేదని.. ప్రజా సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాం.. కనుక అందులో కొనసాగాల్సిందేనని.. స్పష్టం చేశారు. ఈ క్రమంలో పవన్ వచ్చే ఎన్నికల్లో ఓడినా.. రాజకీయాల్లో కంటిన్యూ అవుతాననే విషయాన్ని చెప్పకనే చెప్పారు.
ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అలాగే భవదీయుడు భగత్‌సింగ్ చిత్రంలోనూ పాల్గొంటారు. దీంతోపాటు తమిళ సినిమా వినోదయ సీతమ్ రీమేక్‌లోనూ నటించనున్నారు.