Mithun : టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రం ఆచార్య ఏప్రిల్ 29న విడుదలైన విషయం తెలిసిందే. చిరంజీవి, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. కథ భాగానే ఉన్నా కథనం కొత్తగా లేదని కొరటాల మార్కు ఈ చిత్రంలో కనిపించలేదని ప్రేక్షకులు తెలిపారు. కొరటాల డైలాగ్స్, ఎలివేషన్స్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అయితే చిరు సినిమా కావడంతో మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ చిత్రం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.29.52 కోట్ల షేర్‌ను సాధించింది.

ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో కనిపించాడు. అదే విధంగా ఈ చిత్రంలో సోనూ సూద్ విలన్ గా నటించాడు. పూజా హెగ్డె నీలాంబరిగా కనిపించి అలరించింది. అయితే ఆచార్య సినిమాలో మందమర్రికి చెందిన బాలుడు మిథున్‌కు నటించే అవకాశం లభించింది. మందమర్రికి చెందిన డాక్టర్ భీమనాథుని సదానందం కుమారుడు శ్రీధర్, సరిత దంపతుల కుమారుడు మిథున్ శ్రేయాష్ హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉంటున్నాడు. మిథున్ సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్నాడు.
మిథున్ శ్రేయాన్ష్‌కి ఆచార్యలో అవకాశం ఎలా వచ్చింది అంటే.. మిథున్ కు నటన పై ఎంతో ఆసక్తి ఉంది. దాన్ని గుర్తించిన అతడి తండ్రి శ్రీధర్ ఆచార్య సినిమా ఆడిషన్స్ జరుగుతున్న విషయాన్ని తన స్నేహితుడు విజయ్ కుమార్ ద్వారా తెలుసుకున్నాడు. అలా మిథున్ ను ఆడిషన్స్ కి తీసుకెళ్లాడు. ఇక ఆడిషన్స్ లో మిథున్ డైలాగ్స్ చెప్పి కొరటాల శివను మెప్పించాడు. ఆడిషన్‌లో డైలాగ్‌లు బాగా చెప్పడంతో ఎంపిక చేసుకున్నారు. రాజమండ్రి మారెడుమల్లె, కోకాపేట ఏరియాలో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఇతని గురించి వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.