ప్రముఖ టెక్ సంస్థ విప్రో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశంలోని పలు ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈ మేరకు విప్రో వారు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఇంటర్య్యూలకు హాజరై నేరుగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం పని అనుభవం ఉన్నవారు మాత్రమే కాకుండా ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఇన్ బౌండ్ వాయిస్ ప్రాసెస్, అసోసియేట్ లేదా ప్రాసెస్ అసోసియేట్, నాన్ వాయిస్ ప్రాసెస్, అసోసియేట్ ఫర్ ఆర్డర్ మేనేజ్‌మెంట్ (నాన్ వాయిస్), డేటా అన్నొటేషన్ అండ్ లేబిలింగ్ అసోసియేట్ పోస్టులకు గాను ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ లేదా డిగ్రీ లేదా పీజీ చదివి ఉండాలి. కనీసం 4 ఏళ్ల పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు. ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. అభ్యర్థులకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, పలు రకాల సాఫ్ట్‌వేర్ టూల్స్‌పై అవగాహన, షిఫ్టుల్లో పని చేసే ఓపిక వంటి అర్హతలు ఉండాలి. ఆఫీస్ నుంచి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.
ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ రెజ్యూమ్‌తోపాటు ఆధార్, పాన్ ఐడీ ప్రూఫ్స్, విద్యార్హత సర్టిఫికెట్లు, వాక్సినేషన్ సర్టిఫికెట్లను వెంట తీసుకు రావల్సి ఉంటుంది. అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇక వాకిన్ ఇంటర్వ్యూల విషయానికి వస్తే.. ఫిబ్రవరి 18 నుంచి 27వ తేదీ వరకు భువనేశ్వర్‌లోని ఇన్ఫోసిటీలో ఉన్న విప్రో కార్యాలయంలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు Sanjhli.sharma@wipro.com అనే మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. అలాగే ఫిబ్రవరి 15వ తేదీ వరకు పూణెలోని హింజెవాడిలో ఉన్న ఇన్ఫోటెక్ పార్క్‌లోని విప్రో ఆఫీస్‌లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
హైదరాబాద్‌లోని విప్రో కార్యాలయంలో ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. చెన్నలో ఫిబ్రవరి 28వ తేదీ వరకు, బెంగళూరులో ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు నిర్వహించే వాకిన్ ఇంటర్వ్యూలకు ఆయా తేదీల్లో ఆయా నగరాల్లో హాజరు కావచ్చు.