Movies : ఓటీటీల్లో సినిమాలను చూసే ప్రేక్షకులకు నిజంగా ఈ శుక్రవారం పండుగే అని చెప్పవచ్చు. ఈ రోజు ఏకంగా 3 భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాలు ఇప్పటికే థియేటర్లలో రాగా.. ఒక సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది. గతంలో ఈ విధంగా మూడు భారీ సినిమాలు ఒకే రోజు ఓటీటీలలో వచ్చిన దాఖలాలు లేవు. ఇక ఈ రోజు (మే 20, 2022) ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ థియేటర్లలో ఇప్పటికే 50 రోజులను పూర్తి చేసుకుంది. ఇంకా అనేక థియేటర్లలో రన్ అవుతూనే ఉంది. ఇక మే 20వ తేదీ నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. జీ5లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ నిరాశ పరిచింది. అయితే ఈ మూవీ శుక్రవారం ఓటీటీలో రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని వీక్షించవచ్చు. ఇక మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 12th Man అనే మూవీ కూడా ఈ రోజే రిలీజ్ అవుతోంది. అయితే ఈ మూవీ నేరుగా ఓటీటీలోనే వస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీని కూడా శుక్రవారమే రిలీజ్ చేస్తున్నారు. మిస్టరీ, థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు.
ఇక శ్రీ విష్ణు హీరోగా నటించిన భళా తందనాన సినిమా మే 6న రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ వచ్చి వెళ్లినట్లు కూడా ఎవరికీ తెలియదు. ఈ క్రమంలోనే ఈ మూవీ కూడా శుక్రవారమే ఓటీటీల్లో రిలీజ్ అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ మూవీని వీక్షించవచ్చు.
ఇక ఇవే కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇదే రోజు నుంచి ఎస్కేపీ లైవ్ అనే హిందీ వెబ్ సిరీస్‌ను ప్రసారం చేస్తున్నారు. జీ5లో జాంబివిలి అనే మరాఠీ మూవీ స్ట్రీమ్ అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో చిప్ ఎన్ డేల్ : రెస్‌క్యూ రేంజర్స్ అనే ఇంగ్లిష్ మూవీ స్ట్రీమ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో పంచాయత్ అనే హిందీ సిరీస్‌ను స్ట్రీమ్ చేయనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో మై నెక్ట్స్ గెస్ట్ నీడ్స్ నో ఇంట్రడక్షన్ అనే ఇంగ్లిష్ చాట్ షోను ప్రసారం చేస్తున్నారు.
ఇక నెట్ ఫ్లిక్స్‌లోనే లవ్ డెత్ + రోబోట్స్ అనే సిరీస్‌కు చెందిన 3వ సీజన్ శుక్రవారం నుంచి స్ట్రీమ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నైట్ స్కై సీజన్ 1 ఇంగ్లిష్ వెబ్ సిరీస్‌ను స్ట్రీమ్ చేయనున్నారు. ఇలా మే 20వ తేదీన పలు సినిమాలు, సిరీస్ లతో ఓటీటీలలో నిజంగా పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఓటీటీ ప్రేక్షకులకు ఇంకో వారం పది రోజుల వరకు కావల్సినంత వినోదం లభించనుందని చెప్పవచ్చు.