Vishnu Priya : యాంకర్లలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోవర్ల సంఖ్య ఎక్కువే అని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు ఈమె తన పోస్టులతో అలరిస్తుంటుంది. అందులో భాగంగానే ఈమె తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది. అందులో ఈమె డ్యాన్స్ స్టెప్పులను చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు.
యాంకర్ విష్ణు ప్రియ లేటెస్ట్‌గా ఓ పాటకు స్టెప్పులేసి మరోమారు తనలో దాగి ఉన్న డ్యాన్స్ ప్రతిభను చాటుకుంది. ఎప్పటికప్పుడు ఈమె డ్యాన్స్ వీడియోలను ఇలాగే పోస్ట్ చేస్తుంటుంది. దీంతో ఆ వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇక ఈ వీడియో కూడా వైరల్ గా మారింది. ఇందులో ఈమె డ్యాన్స్ చూస్తే కుర్రకారు గుండెల్లో గుబులు పుడుతోంది.

సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే విష్ణు ప్రియ గ్లామరస్ ఫొటోలను కూడా షేర్ చేస్తుంటుంది. ఇతర యాంకర్లలా ఈమెకు పెద్దగా సినిమా అవకాశాలు లేవు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది.
View this post on Instagram