Ketika Sharma : తెలుగు ప్రేక్షకులకు కేతికా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు, ఇన్‌స్టా పోస్టుల ద్వారా ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ ఢిల్లీ భామకు అనుకోకుండా అదృష్టం కలసి వచ్చింది. దీంతో పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీతో కలిసి రొమాంటిక్ అనే మూవీలో నటించేందుకు అవకాశం వచ్చింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఇందులో కేతికా ఒక రేంజ్‌లో అందాల ప్రదర్శన చేసింది. అయితే సినిమా మాత్రం బోల్తా కొట్టింది. దీంతో కేతికాకు లక్ కలసి రాలేదనే చెప్పాలి.
అయితే తరువాత నాగశౌర్యతో కలిసి లక్ష్య అనే మూవీలో నటించింది. కానీ ఆ మూవీ కూడా ఫ్లాప్ అయింది. దీంతో కేతికాకు అవకాశాలు రావడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. అందులో భాగంగానే తాజాగా మళ్లీ ఈమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రెచ్చిపోయింది. వైట్ కలర్ టాప్, పింక్ కలర్ ప్యాంట్ దరించి ఎద అందాలను ప్రదర్శిస్తూ రెచ్చగొడుతోంది. దీంతో ఈమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా కేతికా శర్మకు ప్రస్తుతం సినిమాలు పెద్దగా ఏమీ లేవు. ఈమె వైష్ణవ్ తేజ్‌తో కలిసి రంగ రంగ వైభవంగా అనే మూవీలో నటిస్తోంది. అయితే కనీసం ఈ మూవీ అయినా ఈమెకు మంచి బ్రేక్ ఇస్తుందో.. లేదో.. చూడాలి.